Sunday, June 23, 2024

నియోజకవర్గ అభివృద్దే దాసరి ఎజెండా.. ఆర్ఓబి కోసం 15 సార్లు వచ్చారు : మంత్రి వేముల

పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్దే దాసరి మనోహర్ రెడ్డి ఎజెండా అని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు వచ్చిన మంత్రి నందన గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఎప్పుడు నా దగ్గరికి వచ్చిన నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు కావాలని కోరుతుంటారన్నారు. కూనారం రైల్వే ఓవర్ బ్రిడ్జి కోసం పట్టువదలని విక్రమార్కుడిలా 15 సార్లు తన వద్దకు వచ్చారన్నారు.

ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆరాటం చూసి ఆర్ఓబి ప్రాముఖ్యత తెలుసుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లగా పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేశారన్నారు. ఎమ్మెల్యే ఎప్పుడు కలిసినా నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేయాలని వాటి ఎస్టిమేషన్లు పట్టుకొని వస్తుంటారన్నారు. అలాంటి ఎమ్మెల్యే ఉండటం పెద్దపల్లి ప్రజల అదృష్టమన్నారు. ఆర్ఓబి పనులను త్వరితగతిన పూర్తి చేస్తే దశాబ్దాల కాలంగా ప్రజల ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement