Thursday, May 2, 2024

TS: ఆ కోడిపుంజు నాదే….ఇచ్చేయండీ సారూ….టిఎస్ ఆర్టీసీకి మొర…

క‌రీంన‌గ‌ర్: తెలంగాణలో పందెం కోడి కేసు హాట్ టాపిక్ గా మారింది. గత నాలుగు రోజులుగా కోడి పుంజు వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. అయితే మ‌రికొద్ది గంట‌ల‌లో కోడి వేలం పాటకు ఆర్టీసీ అధికారులు నోటిఫికేష‌న్ ఇచ్చేశారు.. వేలం స‌మ‌యం ద‌గ్గ‌రికి వ‌చ్చిన వేళ కోడి విషయంలో ఓ కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.

కోడి నాదే అంటూ ఓ వ్యక్తి ఆర్టీసీ అధికారులను కోరడంతో సంచలనంగా మారింది. ఆ కోడి నాదే సార్ నాకోడి నాకు ఇచ్చేయండి అంటూ తెలిపాడు. అయితే ఆర్టీసీ అధికారులు మాత్రం ససేమిరా అంటున్నారు. ప్రకాశం జిల్లా రుద్రంగికి చెందిన మహేష్ అనే వ్యక్తి కోడి నాదే.. నాకు అప్పగించాలని ముందుకు వచ్చాడు. అత‌ను ఓ వీడియోను రిలీజ్ చేశాడు.. మహేష్ రుద్రంగిలో మేస్త్రి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కోడిని అప్పగించాలని మహేష్ కోరుతున్నాడు. అంతేకాకుండా అతను తన ఇంట్లో, పెరట్లో కోడి తిరుగుతున్న వీడియోలతో సహా పంపించడం గమనార్హం. ఈ కోడి నాదే అంటూ వీడియోలు, ఫోటోలు పంపించినా ఆర్టీసీ అధికారులు మాత్రం ససేమిరా అంటున్నారు. నీదే అని గ్యారెంటీ ఏమిటి? కోడిని నీకు ఇచ్చేదే లేదని ఖరా ఖండిగా చెప్పేశారు. ఇన్ని రోజుల నుంచి లేనిది ఇవాళ మధ్నాహ్నం వేలం వేస్తున్నామంటే నీకోడి అని గుర్తుకు వచ్చిందా? అని ప్రశ్నిస్తున్నారు. కోడిని ఇచ్చేదే లేదని స్పస్టం చేశారు. కావాలంటే వేలంలో కోడిపుంజుని పాడుకో అంటూ స‌ల‌హా ఇచ్చేశారు.

కోడి కేసులో అటు కోడి యజమాని, ఇటు కోడిని బంధించి ఆర్టీసీ యాజమాన్యం పెద్ద చిక్కేవచ్చిపడింది. మరి ఆ కోడిని యజమాని మహేష్ కు ఇస్తారా? లేక మధ్నాహ్నం 3 గంటలకు వేలంపాటలో మహేష్ పాల్గొని వేలంపాట పాడి తీసుకోమంటారా? అనే ప్రశ్నలు లేవలెత్తున్నాయి. కాగా.. గత నాలుగు రోజులుగా కరీంనగర్ బస్టాండ్ రెండో డిపోలో ఓ కోడిపుంజు బందీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఎవరూ రాకపోవడం, దానికి తోడు రెండు రోజుల్లో సంక్రాంతి పండుగ రావడంతో ఆర్టీసీ దీనిని వేలం వేసేందుకు సిద్దమయ్యింది. కోడి వేలం వేసేందుకు ఇవాళ మధ్నాహ్నం 3 గంటలకు వేలం వేస్తున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. కోడి యజమాని ఎంట్రీ ఇచ్చాడు. ఆ కోడి నాదే.. నా కోడిని నాకే ఇచ్చేయండి అంటూ ముందుకు రావడంతో ఆర్టీసీ యజమానులు షాక్ తిన్నారు. మరి ఇప్పుడు కోడి విషయంలో ఆర్టీసీ అధికారులు ఎలా స్పందించానున్నారో వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement