Monday, April 29, 2024

నేరాల నియంత్రణ, కేసులు ఛేదనలో సీసీ కెమెరాలు కీలకం : ఎస్పీ రాహుల్ హెగ్డే

నేరాల నియంత్రణకు, సత్వరంగా కేసులను చేదించుటలో సీసీ కెమెరాలు కీలకం అని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే పేర్కొన్నారు.
ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్మాస్పూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన 10 సీసీ కెమెరాలను ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ.. అన్ని గ్రామాల ప్రజలు, ప్రజా ప్రతినిధులు ముందుకు వచ్చి గ్రామంలో విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నేరాలను అదుపు చేయవచ్చని, దొంగతనాలు నివారించే అవకాశం ఏర్పడుతుందన్నారు. దొంగతనం జరిగినా పరిస్థితిలో సీసీ కెమెరాల ద్వారా వారిని గుర్తించి పెట్టుకోవచ్చని చెప్పారు. టీ ఫైబర్ ద్వారా కొత్తగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, అన్ని గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న సీసీ కెమెరాలను జిల్లా పోలీస్ కార్యక్రమంలో ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్ కి అనుసంధానం చేయడం జరుగుతుంది అని దీని ద్వారా ఎక్కడైనా ట్రాఫిక్ వాయిలెన్స్ చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ నుండే జరిమానాలు విధించడం, ఏదయినా గ్రామంలో, పట్టణంలో L&O, ట్రాఫిక్ సమస్య తలెత్తిన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించడం ద్వారా సమస్య ను పరిష్కరించడం జరుగుతుందని అని ఎస్పీ అన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని అన్నారు. ఎల్లారెడ్డిపేట్ మండల పరిధిలో అన్ని గ్రామాల సర్పంచులు తమ గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గ్రామంలో 10 సీసీ కెమెరాల ఏర్పాటు చేసేందుకు కృషి చేసిన దాతలనులను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించరు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల డీఎస్పీ విశ్వప్రసాద్, ఎల్లారెడ్డి పేట సీఐ మోగిలి, ఎస్ఐ శేఖర్, గ్రామ సర్పంచ్ రాదరపు పుష్పల, ఎంపీపీ పిల్లి రేణుక, గ్రామ పంచాయతీ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement