Wednesday, February 28, 2024

బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ ఎత్తి వేయాలి

తెలంగాణ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదని కరీంనగర్ జిల్లా బీజేపీ నేతలు అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాలరాస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ తన సొంత రాజ్యాంగాన్నిఅమలు చేస్తున్నారని ఆరోపించారు. బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజు ప్రతిపక్షాల గొంతు నొక్కేవిధంగా ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు. వెంటనే బిజెపి ఎమ్మెల్యేలపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేయాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. సీఎం కెసిఆర్ కు రాజ్యాంగంపై గౌరవం లేదని, అందుకే లోగడ రాజ్యాంగాన్ని మార్చాలని నిరంకుశంగా వ్యాఖ్యానించారని విమర్శించారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవించకుండా కేసీఆర్ తన సొంత రాజ్యాంగాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement