Tuesday, April 30, 2024

KNR: ఆంధ్రప్రభ అంటే ఎంతో ఇష్టం.. విప్ అడ్లూరి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల (ప్రభ న్యూస్) : ఆంధ్రప్రభ దినపత్రిక అంటే తనకు చిన్నప్పటి నుండి ఎంతో అభిమానమని ప్రభుత్వ విప్ అడ్లురి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వెల్లడించారు. శుక్రవారం జగిత్యాలలో ఆంధ్రప్రభ 2024 నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. చిన్ననాటి నుండి ఆంధ్రప్రభ దినపత్రిక చదవడం అలవాటని, స్వాతంత్ర్యానికి పూర్వం నుండి ఆంధ్రప్రభ దినపత్రిక ప్రచురితమవుతుందన్నారు.

1938లో ఆంధ్రప్రభ దినపత్రిక ప్రచురితం ప్రారంభమైందని, దినదినాభివృద్ధి చెందుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో డిజిటల్, వెబ్ విభాగాల ద్వారా కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందజేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement