Tuesday, June 18, 2024

TS : క‌రీంన‌గ‌ర్‌కు బ‌లం…గ‌ళం ఆయ‌నే….కేటిఆర్

బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు వినోద్‌ కుమార్‌ గళం కరీంనగర్‌కు బలమని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్‌ హ్యాండిల్‌లో ఆయన ఒక పోస్టు పెట్టారు. బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన వినోద్‌ కుమార్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

తెలంగాణ ఉద్యమంలో వినోద్‌కుమార్‌ చురుకైన పాత్ర పోషించారని కేటీఆర్‌ కొనియాడారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ వినోద్ కుమార్.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2001లో ఏర్పాటైన టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరని పేర్కొన్నారు. 2004లో ఎంపీగా గెలిచిన తర్వాత పార్లమెంట్‌లో 32 పార్టీలు తెలంగాణకు అనుకూలంగా లేఖలు ఇవ్వడంలో వినోద్ కుమార్‌ కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement