Sunday, April 28, 2024

Karimnagar – బస్సు యాత్ర మాటలన్నీ అసత్యాలమూటలే – రాహుల్ పై గంగుల ధ్వజం

రాహుల్‌ గాంధీ కరీంనగర్ ఇమ్మడి జలాల్లో నిర్వహించిన బస్సుయాత్రలో
అన్ని అసత్యాలే మాట్లాడారు. ఎవరో స్క్రిప్టు రాసిస్తే చదువుతున్నారే తప్పా అందులో ఏది వాస్తవం ఏది వాస్తం కాదో గమనించడం లేదు.అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ విమర్శించారు. రాహుల్‌ గాంధీ పర్యటనపై ఆయన మీడియా సమావేశంలో నిప్పులు చెరిగారు.
కాళేశ్వరం పథకంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని పాత పాటే పాడారని
ప్రాజెక్టు కు 80 వేల కోట్లు ఖర్చు అయితే. లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుందో.. రాహుల్‌గాంధీ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

రాహుల్ నిన్న, ఈరోజు తిరిగింది అంతా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లొస్తున్న ప్రాంతమే. నిన్న.. మంథని నుంచి.. ప్రాజెక్టు వద్దకు వెళ్లి వస్తే ఆ ప్రాజెక్టు ఎంత గొప్పదో తెలిసేదన్నారు. పచ్చి అబద్దాలు చెప్పడం ధర్మామా? కాంగ్రెస్‌ పాలనలో భూములకు సంబంధించిన ఒక్క రికార్డునైనా అధునీకరణ చేసిందా? భారత దేశంలో రెండు సార్లు రుణమాఫీ చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని అన్నారు


అధికారంలోకి వచ్చిన వెంటనే ఐదు హామీలు అమలుచేస్తమని హామీ ఇచ్చారు. కానీ ఐదు నెలల్లోనే అంధకారం నెలకొంది. కర్ణాటకలో రోజుకు వ్యవసాయరంగానికి 7 గంటల కరెంటు ఇస్తామన్నారు. రెండు మూడు గంటలు కూడ ఇవ్వడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్‌ని నమ్మి ఓటు వేస్తే కర్ణాటక మాదిరిగానే మోసం పోతామన్నారు. బీఆర్‌ఎస్‌ పాలనలోనే తెలంగాణ సురక్షింతంగా ఉంటుందని స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో మేయర్ సునీల్ రావు, బి ఆర్ ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, గ్రంధాలయం చైర్మన్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement