Friday, July 26, 2024

NZB : నిజామాబాద్​లో కమల వికాసం

నిజామాబాద్ సిటీ, డిసెంబర్ 3 (ప్రభ న్యూస్)
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో కమలం వికసించింది. ఇప్పటివరకు 18 రౌండ్లు పూర్తయ్యాయి. ప్రత్యర్థులపై బిజెపి అర్బన్ అభ్యర్థి దన్ పాల్ సూర్యనారాయణ 32వేల పై చిలుకు ఓట్లతో గెలిచారు. జెపి నాయకుల కార్యకర్తల సంబరాలు అంబరాన్నంటాయి. జైశ్రీరామ్ నినాదాలతో ఇందూర్ దద్దరిల్లింది.

నా విజయం కాదు… ప్రజల విజయం…దన్ పాల్ సూర్యనారాయణ

ఈ ఎన్నికల్లో వచ్చిన విజయం నా విజయం కాదని ప్రజల విజయమని బిజెపి అర్బన్ అభ్యర్థి దన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. ప్రజలకు సేవ చేసి భాగ్యం కల్పించడం మా అదృష్టమని ధన్ల్​ పాల్​ వెల్లడించారు. నిజాంబాద్ అర్బన్ను అన్ని విధాల అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. అర్బన్ లో నన్ను గెలిపించినందుకు అర్బన్ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అర్బన్ ప్రజలు కనీవినీ ఎరుగని రీతిలో అత్యధిక మెజారిటీతో దన్ పాల్ సూర్యనారాయణ కు పట్టం కట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement