Sunday, April 28, 2024

TS: కల్వకుంట్ల కన్నారావు అరెస్ట్, రిమాండ్

ఆదిబట్ల, ఏప్రిల్ 2 (ప్రభ న్యూస్) : ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో భూకబ్జా కేసులో నిందితుడుగా ఉన్న కల్వకుంట్ల కన్నా రావును, ఆదిబట్ల పోలీసులు మంగళవారం తెల్లవారు జామున బాలాపూర్ సమీపంలో అరెస్టు చేశారు. తుర్కయాంజల్ మన్నెగూడలో ఓ భూకబ్జా కేసులో మూడు కోట్లకు డీల్ కుదుర్చుకొని, 2.35 కోట్ల రూపాయలు తీసుకొని భూ సెటిల్మెంట్ వ్యవహారంలో కేసు నమోదైన‌ విషయం తెలిసిందే. మార్చి 3 తేదీన కన్నారావుతో పాటు 38 మందిపై కేసు నమోదైంది. ఈ కేసులో నిందితులను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. ఏ3 గా ఉన్న కన్నారావు తప్పించుకుతిరుగుతున్నాడు. భూ కబ్జా కేసు కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించారు.

హైకోర్టు కన్నారావు పిటిషన్ ను కొట్టివేసింది. దీంతో కన్నారావు పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నాడు. పోలీసులకు పట్టుబడకుండా కేరళ, బెంగళూరు, మాల్దీవులు తిరుగుతూ, 7 సెల్ ఫోన్లు వాడుతూ తప్పించుకు తిరిగాడని సమాచారం. మరో మారు బెయిల్ పిటిషన్ ప్రయత్నంలో హైదరాబాద్ కు వచ్చాడు. బొల్లారంలో అడ్వకేట్ ను కలుసుకోవడానికి సిద్దిపేట నుండి బొల్లారం వస్తున్నారని పోలీసులకు సమాచారం రావడంతో, కన్నరావు, అడ్వకేట్ కలుసుకునే స్థావరాన్ని మార్చుకున్నారు. బాలాపూర్ సమీపంలోని కలుసుకోవాలని అనుకున్నారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో బాలాపూర్ సమీపంలో రెండు బృందాలుగా గస్తీ కాసి ఉన్న పోలీసులు కన్నరావును అరెస్టు చేశారు.

కన్నరావు రిమాండ్…
భూ కబ్జా కేసులో నిందితుడైన కన్నారావును ఆదిభట్ల పోలీసులు రిమాండ్ కు తరలించనున్నారు. మంగళవారం తెల్లవారుజామున అరెస్టు కావడంతో.. ఆరోగ్య పరీక్షల కోసం ఆస్ప‌త్రికి తరలించారు. ఆస్పత్రిలో ప‌రీక్ష‌లు నిర్వహించిన తర్వాత సాయంత్రం వరకు కన్నారావు రిమాండ్ కు తరలించనున్నారు. కన్నారావు పై ఐపిసి 307, 447, 436, 148, 149 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement