Friday, May 17, 2024

Shalini : డెనిమ్​లో షాలినీ…

టాలీవుడ్ నటి షాలినీ పాండే లేటెస్ట్ సోషల్ మీడియా పోస్ట్ ఆసక్తికరంగా మారింది. ‘అర్జున్ రెడ్డి’ హీరోయిన్ షాలినీ పాండే సోషల్ మీడియాలో ఎప్పుడూ నెట్టింట దర్శనమిస్తున్న విషయం తెలిసిందే. ఇంట్రెస్టింగ్ గా పోస్టులు పెడుతూ ఆకట్టుకుంటూనే ఉంటోంది. సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ సరసన ఈ ముద్దుగుమ్మ నటించి మెప్పించింది. తొలిచిత్రంతోనే సంచలనంగా మారి అందరి చూపు తనపై పడేలా చేసింది.

సినిమాల సంగతి అటుంచితే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం తన గురించిన అప్డేట్స్ ను అందిస్తూ నెట్టింట సందడి చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా తన వర్కౌట్స్ కు సంబంధించిన వీడియోను పంచుకుంది. తన వర్కౌట్స్ తో అందరినీ ఆకట్టుకుంది. ఇంత‌కు ముందు చ‌బ్బీగా ఉండే అమ్మ‌డు శ‌రీరంలోని మొత్తం కొవ్వ‌ను క‌ర‌గించింది.. దీంతో స్లిమ్ గా మారింది.. ఆ ఫోటోల‌ను ఇప్పుడు త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement