Wednesday, May 22, 2024

ADB: కాగజ్ నగర్ ఆర్డీవో గుండెపోటుతో మృతి

అసిఫాబాద్ కొమురం భీం జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ ఆర్డీవో జాడి రాజేశ్వర్ (59) ఇవాళ ఉదయం గుండెపోటుతో మృతిచెందారు. ఉట్నూరుకు చెందిన జాడి రాజేశ్వర్ ఆదిలాబాద్, ఉట్నూర్ ఆర్డీఓ గా పనిచేసి రెండు నెలల క్రితమే కాగజ్ నగర్ ఆర్డీవో గా బదిలీపై వెళ్లారు.

ఆది, సోమవారాలు రెండు రోజులపాటు ప్రభుత్వ సెలవు ఉండడంతో తన సొంత నివాసం ఉట్నూర్ కు వచ్చి ఉదయం కాలకృత్యాలు తీర్చుకున్న అనంతరం 7.30 గంటలకు ఛాతిలో నొప్పి వస్తుందని చెప్పి గుండెపోటుతో అకాల మరణం చెందారు. ఆయనకు ఒక కూతురు ఇద్దరు కుమారులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement