Thursday, May 2, 2024

Red alret | ప్రమాద స్థాయిలో కడెం.. ఔట్‌ ఫ్లోకు మించి ఇన్‌ ఫ్లో

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కడెం ప్రాజెక్టు పోటెత్తి ప్రాజెక్టు పైనుంచి నీరు ప్రవహిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సాగునీటి ఇంజనీరింగ్‌ నిపుణులబృందం హూటాహుటిన కడెం ప్రాజెక్టు దగ్గరకువెళ్లి పరిస్థితిని సమీక్షిస్తూ తక్షణ చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అధికారులు 12 గ్రామాలకు రెడ్‌ అలార్ట్‌ జారీచేసి 14 గేట్లు ఎత్తి 2,24,901 క్యూసెక్కుల నీటినివిడుదల చేస్తున్నారు. కడెం ప్రాజెక్టు సామర్ధ్యం 3.50 లక్షల క్యూసెక్కులు కాగా 6.04 క్యూసెక్కుల వరదచేరడంతో అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు.

ప్రాజెక్టుకు 18 గేట్లు ఉండగా అందులో 4 గేట్లు మోరాయించడంతో ప్రాజెక్టు పైనుంచి నీరు ప్రవహిస్తోంది. భయాందోళనలో ప్రజలుండగా అధికారులు లోతట్టు ప్రాంతాలనుంచి ప్రజల సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కడెం ప్రాజెక్టుకు ఎగువ ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాలు చేరడంతో పాటుగా ప్రాజెక్టు చుట్టూ పరుచుకున్న కొండలపైనుంచి భారిగా ప్రవాహం చేరుతోంది. గత సంవత్సం 24 జూలైలో కడెంప్రాజెక్టుకు భారీ ప్రవాహం చేరడంతో ప్రభుత్వం తక్ష ణ చర్యలు చేపట్టడంతో పాటుగా రాష్ట్ర ముఖ్యంమంత్రి కేసీఆర్‌ ఏరియల్‌ సర్వే చేసి పరిస్థితిని చక్కదిద్దారు.

- Advertisement -

తక్షణ చర్యలు తీసుకుంటున్నాం

కడెం ప్రాజెక్టు ప్రమాద స్థాయికి చేరడంతో తక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర నీటిపారుదల శాఖ ఆపరేషన్‌, మెయింటనెన్స్‌ ఈ ఎన్‌ సీ స్పష్టం చేశారు. ప్రాజెక్టునుంచి నీటి ప్రవాహం క్రమేణ తగ్గుతోందన్నారు. ప్రతిక్షణం మానిటరింగ్‌ చేస్తుండటంతో పాటుగా ప్రత్యేక ఇంజనీరింగ్‌ బృందం క్షేత్రస్థాయిలో కృషిచేస్తుందన్నారు. కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 702 అడుగులుందన్నారు. కడెం కంట్రోల్లోకి వస్తోందని నీటి పారుదల శాఖ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement