Sunday, April 28, 2024

TS : జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఆత్మహత్య… ఇద్దరు అధికారుల‌పై కేసు

జన్నారం, మార్చి16(ప్రభ న్యూస్): నీటిపారుదల శాఖలోని ఇద్దరు అధికార్ల వేధింపులకు జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకోగా, ఇద్దరు అధికారులపై కేసు నమోదు అయింది. ఈ సంఘటన చర్యనీయాంశమైంది.

- Advertisement -

జన్నారం గ్రామానికి చెందిన తొకల రాకేష్( 37)నిర్మల్ జిల్లా కడెం నారాయణ రెడ్డి ప్రాజేక్ట్ డివిజన్ ఇఇ ఆఫీసులో జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ గా పని చేస్తున్నారు. అదే ఆఫీసులో పని చేస్తున్న సూపరిండెంట్, సీనియర్ అసిస్టెంట్ ప్రభాకర్,శ్రీనివాస్ లు వేధిస్తున్నారని రాకేష్ గురువారం సాయంత్రం తన ఇంట్లో క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడుతున్నానని ఆమె తల్లి సరస్వతి ,తమ్ముడు విశేష్‌ల‌కు తెలిపాడు. వెంటనే రాకేష్ ను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమించిందని చెప్పడంతో కరీంనగర్ లోని ప్రతిమ హాస్పిటల్ కు తరలించి చికిత్స చేయిస్తుండగా, విషయం తెలుసుకొని అక్కడికి చేరుకున్న ఏఎస్ఐ బిక్లాల్ నాయక్ కరీంనగర్ న్యాయమూర్తిచే శుక్రవారం సాయంత్రం వాంగ్మూలాన్ని నమోదు చేయించారు.

రాకేష్ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. ముందుగా చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతున్న రాకేష్ తన వాగ్ములాన్ని మిత్రుడు వీడియో తీయగా ఆ వీడియోలో తన ఆత్మహత్యకు కడెం డివిజన్ కార్యాలయంలో పని చేస్తున్న ప్రభాకర్, శ్రీనివాస్ లే కారణమని ఆరోపించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మృతుని తల్లి సరస్వతి శనివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు నీటిపారుదల శాఖలో పనిచేస్తున్న ప్రభాకర్, శ్రీనివాస్ పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు అదనపు ఎస్సై మృత్యుంజయ సర్కార్ చెప్పారు. పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని లక్షేటిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని లక్షేటిపేట సీఐ అల్లం నరేందర్, జన్నారం ఎస్ఐ సతీష్ కుమార్ సందర్శించారు. ఈ విషయమై జన్నారం,కడెం ,దస్తురాబాద్,ఖానాపూర్ మండలాలలో చర్చనీయాంశమైంది. అటు కడెం ఇటు జన్నారం మండలంలో రాకేష్ తోవిషాడ అమ్ముకున్నాయి.రాకేష్ మృతికి కారణమైన నీటి పారుదల శాఖ ఆ ఇద్దరు అధికార్లను కఠినంగా శిక్షించాలని, మృతుని కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని పలువురు కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement