Tuesday, July 16, 2024

జేపీ న‌డ్డా ర్యాలీ కి అనుమ‌తి

బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా ర్యాలీకి పోలీసులు అనుమ‌తిచ్చారు. నిన్న‌ తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ను గత రెండు రోజుల క్రితం పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. దీంతో బీజేపీ శ్రేణులు ఒక్కసారి భగ్గుమన్నాయి. ఈ నేపథ్యంలో నేడు సికింద్రాబాద్‌లోని మహ్మత్మాగాంధీ విగ్రహం నుంచి ప్యారడైజ్ సర్కిల్ వరకు బీజేపీ శ్రేణులు భారీగా ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలో పాల్గొనడానికి బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా హైద‌రాబాద్ వ‌చ్చారు. జేపీ న‌డ్డా హైద‌రాబాద్ చేరుకున్న స‌మ‌యంలో ఎయిర్ పోర్టులో ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. జేపీ న‌డ్డా ర్యాలీలో పాల్గొనేందుకు అనుమ‌తి లేద‌న్న పోలీసులు ఎట్ట‌కేల‌కు అనుమ‌తించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement