Sunday, May 5, 2024

‘ప్రసాద్ స్కీం’ పనులను పరిశీలించిన -మంత్రి శ్రీనివాస్ గౌడ్

కోరిన కోరికలు తీర్చే జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర గ్రూపు దేవస్థానఆలయాలను దర్శించుకోవడంతో ఎంతో అనుభూతి పొందుతారు భక్తులు. కేంద్ర ప్రభుత్వం ప్రేవేశ పెట్టిన ప్రసాద్ పథకంలో జోగుళాంబ దేవస్థానానికి చోటు దక్కింది.దక్షిణ కాశీగా పేరొందిన అలంపూర్‌‌లోని జోగులాంబ శక్తి పీఠాన్ని ప్రసాద్‌‌ స్కీమ్‌‌లోకి కేంద్ర ప్రభుత్వం చేర్చింది. రూ. 36 కోట్ల, 73 లక్షలు కేటాయించింది. ఈ నిధులతో జోగులాంబ అమ్మవారి ఆలయంతోపాటు అనుబంధంగా ఉన్న పలు ఆల‌యాల్లో సకల సౌకర్యాలు కల్పించనున్నారు. ఇప్పటికే జోగుళాంబ దేవస్థానం ప్రసాద్ పథకం ద్వారా భక్తుల సౌకర్యాల నిమిత్తం చేపట్టే అభివృద్ధి పనులకు రూపకల్పన చేశారు.

అందులో భాగంగా టూరిజం ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో ఎంపీ రాములు, స్థానిక ఎమ్మెల్యే అబ్రహం , ఇతర శాఖల సిబ్బందితో ప్రసాద్ స్కీం పనుల సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం శివరాత్రి పర్వదినాల్లో వచ్చే భక్తులకు దేవస్థానం ఏర్పాటు చేసే సౌకర్యాలు సరిపోవడం లేదు. దీంతో వారు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. వాటిలో ముఖ్యంగా వసతి గదుల క్యూ లైన్లు, వ్రత మండపాలు , అన్నదానం, అంతరాయం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకునే దేవస్థానం ప్రసాద్ పథకం ద్వారా ఈ ఇబ్బందులకు శాశ్వత పరిష్కారానికి ప్రయత్నిస్తున్నారు.అలంపూర్ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయ తుంగభద్ర నది తీరాన ప్రారంభమైన ప్రసాద్ స్కీం పనులను పరిశీలించి అనంతరం జోగులాంబ బాలబ్రహ్మేశ్వర ఆలయాలను దర్శించుకున్నారు అనంతరం బి ఆర్ ఎస్ ఫంక్షన్ హాల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement