Thursday, May 23, 2024

ఈట‌ల‌తో జితేంద‌ర్ లంచ్ మీట్ – మా మ‌ధ్య విబేధాలు మీడియా సృష్టేన‌న్న మాజీ ఎంపి

హైదరాబాద్:మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో తనకు ఎలాంటి విభేదాలు లేవని మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి చెప్పారు.. ఇందంతా కొన్ని మీడియాలు ప‌నిగ‌ట్టుకుని చేస్తున్న ప్ర‌చారం అంటూ కొట్టివేశారు.. హైద‌రాబాద్ లోని జీతంద‌ర్ నివాసానికి నేడు ఈట‌ల వెళ్లారు.. ఇద్ద‌రు నేత‌లు లంచ్ చేసిన త‌ర్వాత ఇటీవ‌ల ఇద్ద‌రిపై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌పై చర్చలు జ‌రిపారు.. ఆ త‌ర్వాత జితేంద‌ర్ మీడియాతో మాట్లాడుతూ, తనది పాలమూరని, ఈటల రాజేందర్ ది హుజూరాబాద్ అని ఆయన చెప్పారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలకు తాను ఇంచార్జీగా ఉండి ఈటల రాజేందర్ ను గెలిపించిన విషయాన్ని జితేందర్ రెడ్డి ప్రస్తావించారు.

అంతా కలిసి పనిచేసే సంప్రదాయం బీజేపీలో ఉందన్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు రాష్ట్ర నేతలకు ఎవరికి పదవులు వచ్చినా మంచిదేనని జితేందర్ రెడ్డి చెప్పారు. ఈటల రాజేందర్, తాను తెలంగాణ ఉద్యమ కాలం నుండి సహచరులమని ఆయన గుర్తు చేసుకున్నారు. పార్లమెంట్ లో తాను బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ గా ఉన్న సమయంలో ఆర్ధిక మంత్రిగా ఉన్న రాజేందర్ న్యూఢిల్లీకి వస్తే తన ఫ్లాట్ లోనే ఉండేవారని ఆయన మీడియాకు తెలిపారు. ఈటల రాజేందర్ తో తనకు విబేధాలు ఎందుకు ఉంటాయని ఆయన మీడియాను ఎదురు ప్రశ్నించారు. కాగా, త‌న‌కు ఢిల్లీతో ప‌ని లేద‌ని, . అందుకే తాను ఢిల్లీకి వెళ్లడం లేదని జితేందర్ రెడ్డి తెలిపారు. అలాగే రాష్ట్ర బిజెపి అధ్య‌క్ష ప‌ద‌విని తాను ఆశించ‌డం లేద‌న్నారు.. అలాగే తెలంగాణ‌లో కాంగ్రెస్ గిమ్మిక్కులకు బీజేపీ భయపడదన్నారు.

also

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement