Thursday, May 2, 2024

నాపై తప్పుడు వార్తలు రాస్తే నడిరోడ్డుపై నిలబెట్టి బట్టలిప్పుతా – ఎమ్మెల్యే జగ్గారెడ్డి

ఉమ్మడి మెదక్ బ్యూరో (ప్రభ న్యూస్) నా రాజకీయ ప్రయాణం రాహుల్ గాంధీ‌తోనే.. నా రాజకీయ ప్రయాణం కాంగ్రెస్ పార్టీతోనే. నాకేమైనా బాధ్యత ఇస్తే కచ్చితంగా చేస్తాను. నేను పార్టీ మారుతాననే ప్రచారం అబద్దం. నేను రాహుల్ గాంధీని మొదటిసారి కలిసిన విషయం అందరికీ తెలుసు. నేను రెండవరోజు కూడా ఒంటరిగా రాహుల్‌ను కలిశారు. రాహుల్ నాకు 20 నిమిషాల సమయం ఇచ్చారు. నేను చెప్పేది రాహుల్ విన్నారు. ఆయన ఏం సమాధానం చెప్పలేదు. అయినా నేను సంతోషంగానే ఉన్నాను. నాది శాసించే వయస్సు.. నన్ను ఎవరో బుజ్జగిస్తే వింటానా?. కథలు, కథనాలు మీరే రాస్తున్నారు. రాసేవాళ్ళకు అంత ఆనందం ఏంటో నాకు తెలియట్లేదు. ఏడాదిన్నరగా సోషల్ మీడియాలో నాపై ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో ఇలా జరుగుతోంది. నాపై ఇలా ఎందుకు రాయిస్తున్నారో తెలియదు’ అని కారెక్కే ప్రస్తక్తే లేదని.. కాంగ్రెస్‌లోనే ఉంటానని బల్లగుద్ది మరీ జగ్గారెడ్డి చెప్పారు.

‘కాంగ్రెస్‌లో నేను ఉండకూడదని భావిస్తున్నారా? ఎన్నికలు రాగానే మళ్లీ నేను పార్టీ మారుతున్నట్లు పోస్టులు పెడుతున్నారు?’ అంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి నేడు జరిగిన మీడియా సమావేశంలో విరుచుకుపడ్డారు.. తాను కాంగ్రెస్‌లో ఉండకూడదన్నది ఎవరి వ్యూహమని ప్రశ్నించారు. తాను పార్టీ మారుతున్నానని ప్రచారం చేయడానికి అలా అసత్య ప్రచారం చేసేవారికి ప్యాకేజీలు ఎవరు ఇస్తున్నారో చెప్పాలని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీలో జగ్గారెడ్డి ఉండవద్దా? అని ఆయన ప్రశ్నించారు.ఏడాదిన్నరగా తనపై పార్టీలో దుష్ప్రచారం జరుగుతోందన్నారు. తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్ర జరిగిన పది రోజులకే తనపై పార్టీ మారుతున్నట్లుగా ప్రచారం ప్రారంభించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత శాడిజం ఏమిటో తనకు అర్థం కావడం లేదన్నారు.

రాహుల్ జోడోయాత్ర సంగారెడ్డి నుంచి వస్తోందంటే సంతోషమయ్యింది. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా జోడోయాత్ర సక్సెస్ చేశాను. రాహుల్ పాదయాత్రలో ఆయనకి నాపేరు నోటెడ్ అయింది. రాహుల్ నన్ను మెచ్చుకున్న పది రోజులకే నన్ను కోవర్ట్ అని సోషల్ మీడియాలో రాయించారు. ఇదేం దరిద్రపు అలవాటు.. ఇంతా శాడిజం ఎందుకు..?. 2017లో కోట్లాది రూపాయలు పెట్టి భారీ బహిరంగ సభ చేశాను. 2018లో పాస్‌పోర్ట్ కేసులో నన్ను ప్రభుత్వం జైల్లో పెట్టింది. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి కోట్లాడి గెలిచాను. లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేయొద్దని రేవంత్ తీర్మానం చేస్తే సీఎం కేసీఆర్ సొంత జిల్లాల్లో కోట్లాడాల్సిందేనని నిలబడ్డాను. లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్లతో సహా 9 ఓట్లు అదనంగా తెచ్చాను. కాంగ్రెస్ కోసం ఇంత చేస్తుంటే ఎవడికి తోచింది వాళ్ళు రాస్తారు. నాపై రాసే వాళ్ళకి మెంటల్ ఎక్కిందా?. ఇంత జరుగుతున్నా నా పార్టీ వాళ్ళు మాట్లాడరా?’ అని జగ్గారెడ్డి ఒకింత ఆవేదనకు లోనయ్యారు.

‘ నేను కాంగ్రెస్‌లో ఉండొద్దని ఎవరైనా వ్యూహం పన్నుతున్నరా?. చెత్త నా కొడుకులు నా గురించి ఏం అనుకుంటున్నారు?. నేను కన్నెర్ర చేస్తే రోడ్లపై తిరగగలరా?. నేనెందుకు సంజాయిషీ చెప్పాలి. నాకు అంత ఖర్మ ఎందుకు?. కొందరు నా రాజకీయ లైఫ్‌తో ఆడాలనుకుంటున్నారు. నేను ఆట స్టార్ట్ చేస్తే తట్టుకోలేరు. ఆధారాలు లేకుండా నాపై తప్పుడు వార్తలు రాస్తే నడిరోడ్డుపై నిలబెట్టి బట్టలిప్పుతా. సంవత్సరన్నర నుంచి.. ఇద్దరు, ముగ్గురు నాపై విష ప్రచారం చేస్తున్నారు. ఏ పార్టీ నుంచి మా పార్టీలోకి వచ్చినా వాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళే. నేను పార్టీ మారుతాననే ప్రచారం అబద్దం. కాంగ్రెస్ పార్టీలో ఏ సమావేశం జరిగినా నాకు సమాచారం ఉంటుంది. నాపై విష ప్రచారం చేస్తున్న మూర్ఖులు ఇకపై మానేయండి. కొంతమంది రాసే వార్తలకు చాలా బాధగా ఉంది. ఎన్నో బాధలు పడుతూ ఎమ్మేల్యే అయ్యాను. నన్ను బీఆర్ఎస్‌లోకి రావొద్దని మంత్రి హరీష్ రావును కలిసినవాళ్ళని లీడర్లని చేసింది నేనే. మరోసారి రాహుల్ గాంధీని సంగారెడ్డికి ఆహ్వానిస్తా.. ఆయన వస్తే సంతోషిస్తాను’ అని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement