Saturday, May 4, 2024

IT Raids – పొంగులేటి కుటుంబ సభ్యులను హైదరాబాద్ తరలించిన ఐటీ అధికారులు

ప్రభ న్యూస్ ఖమ్మం క్రైమ్.మాజీ ఎంపీ, పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాల పై గురువారం ఐటీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఖమ్మంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో సోదాలు నిర్వహించిన అధికారులు మధ్యలో రెండు గంటల సమయం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ వేసేందుకు అనుమతించారు. దీంతో ఆయన కార్యకర్తలతో కలిసి ర్యాలీగా బయలుదేరి వెళ్లి నామినేషన్ ప్రక్రియ ముగించుకున్న అనంతరం ఆయన ఇంటికి చేరుకున్నారు.

సాయంత్రం వరకు నారాయణపురం, ఖమ్మం ఇల్లు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన అనంతరం పొంగులేటి సతీమణి, ఆయన కుమారుడు, సోదరుడు ప్రసాద్ రెడ్డి ని అధికారులు హైదరాబాద్ వారి కారులో తరలించారు. తనను కూడా హైదరాబాద్ తరలించాలని చూడడంతో తనకు షెడ్యూల్ ప్రకారం ఉన్న కార్యక్రమాలు జరగకపోతే తర్వాత జరిగే పరిణామాలకు తాను కారణం కాదని ఐటీ అధికారులకు తెలపడంతో తనను ఇక్కడే వదిలి వెళ్లారని పొంగులేటి పేర్కొన్నారు.

నారాయణపురంలో తన 83 ఏళ్ల తల్లిని కూడా ఇబ్బందులకు గురి చేశారని, తన అకౌంటెంట్ పై కూడా చేయి చేసుకున్నారని, తన అల్లుడిని అరెస్టు చేస్తామని ఐటీ అధికారులు బెదిరింపులకు దిగినట్లు పొంగులేటి మీడియాకు తెలిపారు. 33 చోట్లలో కేవలం రెండు చోట్ల మాత్రమే దాడులు ముగిశాయని మిగతా చోట్ల కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement