Thursday, June 13, 2024

Breaking: మంత్రి మ‌ల్లారెడ్డి కేసులో ఈడీకి ఐటీ లేఖ

తెలంగాణ రాష్ట్ర‌ మంత్రి మల్లారెడ్డి కేసులో ఐటీ శాఖ అధికారులు ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కి లేఖ రాశారు. మంత్రి మల్లారెడ్డి అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ఐటీ దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సోదాలకు సంబంధించిన పూర్తి నివేదికతో ఈడీకి ఐటీ అధికారులు లేఖ రాశారని సమాచారం. ఇప్పటివరకు సేకరించిన సాక్ష్యాలను లేఖలో పేర్కొన్నారు. మల్లారెడ్డికి సంబంధించిన మెడికల్ సీట్లు, డొనేషన్ల విషయంలో అవకతవకలు జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో మల్లారెడ్డి కేసులో ఈడీ దర్యాప్తు చేయాల్సిన అవసరముంద‌ని ఐటీ భావిస్తోంది. అదేవిధంగా మనీ లాండరింగ్ కోణంలోనూ దర్యాప్తు జరపాలని ఐటీ లేఖలో కోరింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement