Thursday, May 2, 2024

Invitation – నా ప్ర‌మాణ స్వీకారానికి రండి…సోనియా, ప్రియాంకా, రాహుల్ ల‌కు రేవంత్ ఆహ్వానం

తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రేపు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఎల్ బి స్టేడియంలో రేపు మధ్యాహ్నం 1.04 గంటలకుకి ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించనున్నారు.. ఈ నేప‌ధ్యంలో ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న రేవంత్ కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత సోనియాగాంధీ, రాహుల్ గాంధీ , ప్రియాంకా గాందీల‌ను కలిశారు. తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకావాలని వారిని ఆహ్వానించారు . అంతకు ముందు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ లతో కూడా రేవంత్ సమావేశమయ్యారు. వారిని కల‌సి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు..ప్ర‌మాణ స్వీకారానికి రావాల్సిందిగా వారిని కోరారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement