Wednesday, February 21, 2024

Rajasingh: కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుంది.. బీజేపీ వస్తుంది… రాజాసింగ్ సంచల‌న వాఖ్య‌లు…

ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో డా.బీ.ఆర్. అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో డా.బీ.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడారు.

8 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు. డా.బీ.ఆర్. అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం మా పార్టీ కార్యాలయంలో నిర్వహించామని..దళితులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కేసీఆర్ నిలబెట్టుకోలేదని ఫైర్‌ అయ్యారు. భారత రాజ్యాంగాన్ని మారుస్తా అన్న కేసీఆర్ నే తెలంగాణ ప్రజలు మార్చేశారని మండిపడ్డారు. మూడు రాష్ట్రాల్లో బీజేపీ గెలిచిందని…తెలంగాణలో కాంగ్రెస్ ఎక్కువ రోజులు ప్రభుత్వాన్ని నడపలేదన్నారు. కేసీఆర్ అప్పులు చేసి వెళ్లారు… అప్పులు పూడ్చడం తోనే కాంగ్రెస్ కు సరిపోతుందని చురకలు అంటించారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీ లు ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement