Sunday, February 25, 2024

NZB: అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం: కలెక్టర్ జితేష్ వి.పాటిల్

కామారెడ్డి, ఆగస్టు 17 (ప్రభ న్యూస్): విపత్తు నిర్వహణలో విశేష కృషిసల్పిన వ్యక్తులు, సంస్థల నుండి సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ అవార్డులకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఆన్ లైన్ లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నదని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఇవాళ తెలిపారు. జనవరి 23న నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా విపత్తు నిర్వహణలో అద్భుతమైన పనితీరు కనబరచిన వ్యక్తులకు, సంస్థలకు భారత ప్రభుత్వం ప్రతి ఏటా అవార్డును అందిస్తుందన్నారు.

అవార్డుకు ఎంపికైన వ్యక్తులకు, సంస్థలకు మూడు నగదు బహుమతులు అందజేస్తుందని ఆయన తెలిపారు. 2024 సంవత్సరానికి సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ అవార్డుకు అర్హులని భావించిన వ్యక్తులు లేదా సంస్థలు https://awards.gov.in వెబ్ సైట్ నందు ఆన్ లైన్ లో ఈనెల 30 లోగా దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు ఆ వెబ్ సైట్ ను సందర్శించాలని కలెక్టర్ పాటిల్ సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement