Monday, May 6, 2024

జూలో అంతర్జాతీయ చిరుత దినోత్సవం.. వ్య‌న్య‌ప్రాణుల ఇంపార్టెన్స్ పై విద్యార్థుల‌కు వివ‌ర‌ణ‌..

ప్రభన్యూస్‌: ఇందిరా గాంధీ జూలాజికల్‌ పార్కులో వన్య ప్రాణుల సంరక్షణ దినోత్సవం, అంతర్జాతీయ చిరుత దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జవాద్‌ తుఫాన్‌ కారణంగా జూ మూసివేయబడి ఉండటంతో వెబినార్‌ కార్యక్రమం ద్వారా బివికె కళాశాల విద్యార్థులకు వన్య ప్రాణుల ప్రాముఖ్యతను చిరుతల జీవన విధానం గురించి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.

జూ క్యూరేటర్‌ నందినీ సలారియా ఆన్లైన్లో విద్యార్థులకు వన్యప్రాణుల సంరక్షణ గురించి క్షుణ్ణంగా వివరించారు. పర్యావరణంలో వన్యప్రాణుల పాత్రను వాటి ప్రాముఖ్యతను వివరించారు. చిరుతుల వన్యప్రాణుల సంరక్షణ గురించి పవర్‌ పాయిన్ట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా విద్యార్థులకు వివరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement