Friday, October 4, 2024

TS: ఆస్తి తగాదాల్లో.. కూతురు, అల్లుడిపై దాడి.. ఒకరు మృతి

ఆస్తి తగాదాల్లో ఓ తండ్రి కూతురు, అల్లుడిపై దాడికి పాల్పడగా… కూతురు చనిపోగా, అల్లుడి పరిస్థితి విషమంగా ఉన్న ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని వైరా మండలం తాటిపూడిలో ఘటన జరిగింది.

వైరా మండలం తాటిపూడి గ్రామంలో భూమి వివాదాలు, ఆస్తుల విషయంలో పిట్టల రాములు అనే వ్యక్తి కూతురిని, అల్లుడిని హత్యాయత్నం చేయగా.. కూతురు ఉషా మృతిచెందగా, అల్లుడు కృష్ణ పరిస్థితి విషమంగా ఉంది. దీంతో స్థానికులు కృష్ణను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న వైరా ఏసీపీ యం ఏ రహమాన్, సిఐ సాగర్, ఎస్సై మేడా ప్రసాద్, పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement