Friday, May 3, 2024

TS: మరికాసేపట్లో పొన్నాల ఇంటికి కేటీఆర్.. పార్టీలోకి రావాలని ఆహ్వానం

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ను మరికొద్దిసేపట్లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ కలవనున్నారు. హైదరాబాద్ లోని పొన్నాల నివాసానికి స్వయంగా కేటీఆర్ నేటి మధ్యాహ్నం 2గంటలకు వెళ్లనున్నారు.

కాంగ్రెస్ పార్టీకి పొన్నాల రాజీనామా చేసిన నేపథ్యంలో తమ పార్టీలోకి రావాల్సిందిగా కేటీఆర్ ఆహ్వానించనున్నారు. నిన్న పొన్నాల రాజీనామా చేసిన తర్వాతనే కేటీఆర్ స్పందిస్తూ.. పొన్నాల తమ పార్టీలోకి వస్తానంటే సగౌరవంగా తానే ఆహ్వానిస్తానని, పార్టీలో సముచిత గౌరవం కల్పిస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement