Saturday, April 13, 2024

TS: మూడోసారి మోడీ పీఎం అయితే… ప్రపంచంలోనే భారత్ నంబర్ వన్.. సీఎం హేమంత్ విశ్వ శర్మ

నిర్మల్ ప్రతినిధి, బైంసా ఫిబ్రవరి 20 (ప్రభ న్యూస్) : త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి బీజేపీకి పట్టం కడితే ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ప్రపంచంలోనే భారత్ నంబర్ వ‌న్ గా నిలుస్తుందని అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ విశ్వ శర్మ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం బాసర లో ప్రారంభ‌మైన బీజేపీ విజయ సంకల్ప బస్సు యాత్ర భైంసాకు చేరుకున్న సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఓబీసీ జాతీయ మోర్ఛ అధ్యక్షులు కే లక్ష్మణ్ హాజరై ప్రజల ఉద్దేశించి మాట్లాడారు.

మోడీ అభివృద్ధి పరిచిన జాతీయ రహదారులపైనే ప్రియాంక, రాహుల్ గాంధీ పాదయాత్రలు చేపడుతున్నారని ఆరోపించారు. విజయ సంకల్ప యాత్ర 5500 కిలోమీటర్ల మేర సాగనుందని, ఈ యాత్ర జయప్రదం చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. మూడోసారి ముచ్చటగా మోడీనే ప్రధానమంత్రిగా చేసి, దేశం అభివృద్ధి పథంలో సాగాలనే ఉద్దేశంతో యాత్ర కొనసాగుతుందని తెలిపారు. తెలంగాణలో బీజేపీ రోజురోజుకు బలపడుతుందన్నారు. 2018 సంవత్సరంలో 6.8 శాతం ఓట్లు సంపాదించగా, 2023 లో 14.9 అయిందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని, వీళ్ల పాలన రజాకార్ల పాలనని, దీన్ని అంతం చేసే రోజులు దగ్గర పడుతున్నాయన్నారు. భారత ప్రజలు కాంగ్రెస్ ని తరిమికొట్టి మోడీని తీసుకొచ్చారని, మోడీ రామ మందిరాన్ని తీసుకొచ్చారన్నారు. ప్రస్తుతం ప్రజలు మోడీని 3వ సారి ప్రధానిగా తీసుకురావాలని పిలుపునిచ్చారు. దేశంలో అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఘనత మోడీదేనని కొనియాడారు. తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను అమలు చేయలేకపోతుందని, నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ఊసే లేదన్నారు. అస్సాం రాష్ట్రంలో పెట్రోల్ 98 రూపాలు కాగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ పై టాక్స్ వేసి 110 రూపాలకు ఇస్తూ ప్రజలపై భారాన్ని మోపి రక్తాన్ని తాగుతున్నారని ప్రజలను వేస్తున్నారని ఆయన దూయబెట్టారు.

సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ముగ్గురు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం వచ్చి అన్ని ఉచితంగా ఇస్తామని హామలిచ్చారు. ఏ ఒక్క హామీ నెరవేర్చ‌లేద‌న్నారు. గతంలో రాహుల్ భారత్ జోడో యాత్ర నిర్వహిస్తే మూడు రాష్ట్రాలు గాలిలో కలిసాయని, ఇప్పుడు భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్నాడని, అయితే మొత్తం భారతదేశంలోనే కాంగ్రెస్ పార్టీ గాలిలో కలుస్తుందన్నారు. భారత్ యాత్రతో ఒరిగిందేమీ లేదన్నారు. అస్సాం ప్రజలు రాహుల్ భారత్ జూడో యాత్రను తిరస్కరించారన్నారు. నిర్మల్ శాసనసభ్యులు మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ నుండి బీజేపీలోకి వచ్చి ఎమ్మెల్యే అయ్యారని, ఎమ్మెల్యే తో పాటు ఫ్లోర్ లీడర్ అయ్యారన్నారు.

- Advertisement -

అలాగే తాను కూడా కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీ లోకి వచ్చి అస్సాంకు ముఖ్యమంత్రిని అయ్యానన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, మణిపూర్ మంత్రి సుసేంద్ర మెహర్, అదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు సోయం బాపూరావు, అదిలాబాద్ ప్రబారి అల్జాపూర్ శ్రీనివాస్, బస్సు యాత్ర ఇన్చార్జి దుగ్గాల ప్రవీణ్ రావు, నిర్మల్ జిల్లా ఇన్చార్జి పల్లె గంగారెడ్డి, నిర్మల్ జిల్లా అధ్యక్షులు అంజి కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, పాయల్ శంకర్, పవర్ రామారావు పటేల్, అదిలాబాద్ మాజీ జిల్లా పరిషత్ రెడ్డి, పల్లె గంగారెడ్డి, అయ్యన్న గారి భూమయ్య, రావుల రామనాథ్, ఎంపీపీ అబ్దుల్ రజాక్, భీమ్రావు, సావలి రమేష్, తదితరులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement