Saturday, April 27, 2024

WGL: ప్రొ.జయశంకర్ జిల్లా కలెక్టరేట్ ప్రారంభించడం నా అదృష్టం.. కేటీఆర్

ప్రొఫెసర్ జయశంకర్ జిల్లా సమీకృత కలెక్టరేట్ ప్రారంభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి కేటీఆర్ అన్నారు. కలెక్టరేట్ ప్రారంభించిన అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… దేశంలో ఇతర రాష్ట్రాల కంటే గొప్పగా జిల్లా కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయాలు ఉన్నా యన్నారు. తొమ్మిదిన్నర సంవత్సరాల తెలంగాణ ప్రగతి సమగ్ర, సమతుల్యత, సమ్మిళితం అభివృద్దే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని అభివృద్ధి తెలంగాణలో జరిగిందన్నారు. భౌగోళికంగా 11వది జనాభా పరంగా 12వ స్థానం, దేశంలో 4వ స్థానంలో తెలంగాణ ఉందన్నారు.


ఫర్ క్యాపిటల్ ఇన్ కం లో 1వ స్థానంలో తెలంగాణ ఉందన్నారు. ఐటీ, వ్యవసాయ ఉత్పత్తుల్లో తెలంగాణ అగ్రగామిగా ఉందన్నారు. పరిశ్రమలు పర్యావరణంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందన్నారు. ఒకవైపు అభివృద్ధి, మరో వైపు సంక్షేమం సమదృష్టితో ముందుకు వెళ్తున్నామన్నారు. దేశంలో ఎప్పుడు అవార్డులు వచ్చినా తెలంగాణ మొదటి 10 స్థానాల్లో ఉంటుందన్నారు. 2014 కంటే ఈరోజు వరకు జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు ఆశీర్వదిస్తారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement