Sunday, April 28, 2024

గోల్డెన్ పీకాక్ ఎకో-ఇన్నోవేషన్ అవార్డు అందుకున్న వెల్ స్పన్ గ్రూప్ ఫ్లోరింగ్ డివిజన్

హైదరాబాద్ : వినూత్నమైన ఫ్లోరింగ్ సొల్యూషన్‌లకు సంబంధించి ప్రముఖ తయారీదారు, వెల్ స్పన్ గ్రూప్ ఫ్లోరింగ్ డివిజన్ (వెల్ స్పన్ ఫ్లోరింగ్ లిమిటెడ్), 24వ అంతర్జాతీయ పర్యావరణ నిర్వహణ, వాతావరణ మార్పుల సదస్సులో ఇటీవల సాధించిన గౌరవాన్ని గురించి వెల్లడిస్తుండటం పట్ల సంతోషంగా వుంది. ప్రతిష్టాత్మకమైన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో బిల్డింగ్ మెటీరియల్స్ రంగంలో అత్యంత గౌరవనీయమైన గోల్డెన్ పీకాక్ ఎకో-ఇన్నోవేషన్ అవార్డుతో డబ్ల్యూఎఫ్ఎల్ సత్కరించబడింది.

ఈసందర్భంగా వెల్ స్పన్ గ్రూప్ ఫ్లోరింగ్ డివిజన్ డబ్ల్యూఎఫ్ఎల్ ప్లాంట్ హెడ్ ఉత్పల్ హల్దార్ మాట్లాడుతూ… బిల్డింగ్ మెటీరియల్స్ రంగంలో గోల్డెన్ పీకాక్ ఎకో-ఇన్నోవేషన్ అవార్డును అందుకోవడాన్ని ఒక గౌరవంగా భావిస్తున్నామన్నారు. ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు సస్టైనబిలిటీ పై తమ నిరంతర నిబద్ధతకు, వినూత్న పరిష్కారాల కోసం తమ అవిశ్రాంత అన్వేషణకు నిదర్శనమన్నారు. పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవడంలో వ్యాపారాలు కీలక పాత్ర పోషించాలని తాము దృఢంగా విశ్వసిస్తున్నామన్నారు. ఫ్లోరింగ్ పరిశ్రమ పరంగా పర్యావరణ-ఆవిష్కరణలో ముందంజలో ఉన్నందుకు తాము గర్విస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement