Sunday, February 18, 2024

HYD: వామన ఆశ్రమ మహా స్వామీజీ ఆధ్వర్యంలో.. వైభ‌వంగా ల‌క్ష పుష్పార్చ‌న

హైద‌రాబాద్, డిసెంబ‌ర్ 2 (ప్ర‌భ న్యూస్) : కొత్త‌పేట్ క‌న్య‌కా ప‌ర‌మేశ్వ‌రి టెంపుల్ లో శ‌నివారం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మహిళా విభాగం నిర్వహించిన లక్ష పుష్పార్చన కార్యక్రమం శ్రీ శ్రీశ్రీ వామన ఆశ్రమ మహా స్వామీజీ ఆధ్వర్యంలో జరిగినది. ఈకార్యక్రమంలో 500 మంది మహిళల పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఐవీఎఫ్‌ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్ పూర్వ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, మహిళా విభాగం ప్రథమ మ‌హిళ‌ ఉప్పల స్వప్న, అధ్యక్షురాలు చంద భాగ్యలక్ష్మి, శైలజ, మణిమాల, అనిత, జేయ శ్రీ, అర్చన, వీణ కుమారి ల‌ ఆధ్వర్యంలో జరిగిన లక్ష పుష్ప అర్చన కార్యక్రమం విజయవంతమైంది.

ఈ కార్యక్రమానికి హాజరైన వారు బొగ్గార‌పు ద‌యానంద్ ఎమ్మెల్సీ, ఐవీఎఫ్ తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రెటరీ పబ్బా చంద్రశేఖర్, అడిషనల్ జనరల్ సెక్రెటరీ కటకం శ్రీనివాస్, అడ్వైజర్ ముత్యాల సత్తయ్య, యువజన అధ్యక్షుడు కట్ట రవికుమార్, ఆధ్యాత్మిక కమిటీ చైర్మన్ బోనగిరి శ్రీనివాస్, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు శంభు పాండయ్య గుప్తా, వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ యువజన నాయకుడు శ్రీధర్, ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ఐవీఎఫ్‌ కుటుంబ సభ్యులు, వైశ్య మహిళలు, వైశ్య ప్రముఖులు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement