Friday, April 26, 2024

పాఠశాల అభివృద్ధికి రూ.25000 అంద‌జేసిన ఉప్ప‌ల శ్రీ‌నివాస్ గుప్తా

ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గం ఉప్పల్ మండలం కొత్తపేట గ్రామంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధి కొరకై 25,000 రూపాయ‌ల‌ను నాగోల్ లోని తన కార్యాలయంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అంద‌జేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసులు, స్కూల్ అసిస్టెంట్ కృష్ణారెడ్డి, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర కో-ఆర్డినేటర్ కూర నాగరాజు, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర పొలిటికల్ కమిటీ చైర్మన్, బచ్చు శ్రీనివాస్, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రంగారెడ్డి జిల్లా ట్రెజరర్ చింతల రజినీకాంత్, వారి కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement