Saturday, March 2, 2024

బోనాల జాతర ఏర్పాట్లను పరిశీలించిన ఉప్పల్ ఎమ్మెల్యే బేతి

ఉప్పల్ డివిజన్: ఉప్పల్ డివిజన్ లోని శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారి దేవాలయం పరిసరం ప్రాంతంలో రేపు ఉప్పల్లో జరగబోయే బోనాల పండుగ జాతర సందర్భంగా ఏర్పాట్లను ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. ఉప్పల్ ప్రధాన రహదారి నుండి దేవాలయం వరకు రోడ్లపైన గుంతలు లేకుండా కాంక్రీట్ రోబో సాండ్ వేయించి గుంతలను పూడ్చివేయాలని, దేవాలయం పరిసర ప్రాంతమంతా శుభ్రం చేయాలని, దేవాలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఉప్పల్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసులు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగేందర్, డీఈ నిఖిల్ రెడ్డి, ఎస్ డబ్ల్యూ డి ఈ చందన, ఉప్పల్ గ్రామ పెద్దలు మేకల శివారెడ్డి, పోగుల దయాకర్ రెడ్డి, సల్ల రాజిరెడ్డి, బిక్కుమల్ల అంజయ్య గుప్తా, కుమ్మరి నారాయణ, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జనంపల్లి వెంకటేశ్వర్ రెడ్డి, వేముల సంతోష్ రెడ్డి, మేకల మధుసూదన్ రెడ్డి, చింతల నరసింహారెడ్డి, కాటిపల్లి రవీందర్ రెడ్డి, గుడి మధుసూదన్ రెడ్డి, పంగ మహేందర్ రెడ్డి, సత్యపాల్ రెడ్డి, నయా వెంకట్రావు, అన్య వెంకటేష్, వీరేష్, స్వీట్ హౌస్ రాజు, పల్లె నర్సింగరావు ఈరెల్లి రవీందర్ రెడ్డి, వంశీ తిరుమలేష్ జెసిబి రాజు ప్రభాకర్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement