Monday, April 29, 2024

హైదరాబాద్ లోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో భారీ అగ్ని ప్రమాదాలు

హైదరాబాద్ లో బుధవారం తెల్లవారుజామున రెండు అగ్నిప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. హబ్సీగూడాలో, అత్తాపూర్ లో జరిగిన ఈ అగ్ని ప్రమాదాల్లో మంటలు తీవ్ర స్థాయిలో ఎగిసిపడ్డాయి.

హైదరాబాద్లో మరో అగ్ని ప్రమాదం కలకలం సృష్టించింది. హబ్సిగూడలోని అన్ లిమిటెడ్ షోరూంలో అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం అర్థరాత్రి దాటిన తరువాత మంటలు చెలరేగాయి . మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అగ్నిమాపక సిబ్బంది. అదుపు చేశారు. . ఉప్పల్ – సికింద్రాబాద్ ప్రధాన రహదారి కావడంతో పొగతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. . ఘటనా స్థలం పక్కనే పెట్రోల్ బంక్ ఉండడంతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు..

మరోవైపు హైదరాబాద్ అత్తాపూర్ హసన్ నగర్ లో కూడా భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ బట్టల గోదాంలో మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగ వ్యాప్తితో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రెండు ఫ్లోర్లలో వ్యాపించిన మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పుతున్నారు. మంటలు మరింత వ్యాపించకుండా అధికారుల చర్యలు చేపట్టారు. సమీప ఇళ్లకు మంటలు వ్యాపించకుండా అధికారులు చర్యలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement