Wednesday, October 2, 2024

HYD: కూకట్‌పల్లిలో మూడు బస్సులు దగ్ధం..

పార్కింగ్ చేసిన మూడు బ‌స్సులు ద‌గ్ధ‌మైన ఘ‌ట‌న‌ హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో చోటుచేసుకుంది. కూకట్‌పల్లిలోని ఐడీఎల్ చెరువు వద్ద భారతీ ట్రావెల్స్‌కు చెందిన మూడు బస్సుల్లో అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది పక్కనే ఉన్న బస్సులను అక్కడి నుంచి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని.. రెండు ఫైర్‌ఇంజిన్లతో మంటలను అదుపుచేశారు. ఈఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement