Sunday, October 13, 2024

Theft – పశువర్ధక శాఖ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కల్యాణ్ ఆఫీస్‌లో ఫైల్స్ మాయం

హైదరాబాద్‌లోని మాసబ్ ట్యాంక్‌లో ఉన్న తెలంగాణ పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఫైల్స్ మాయం కావడం సంచలనంగా మారింది. పశువర్ధక శాఖ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కల్యాణ్ ఆఫీస్‌లో కీలకమైన డాక్యుమైంట్లు మిస్ అయినట్లు సమాచారం. ఆఫీస్ కిటికీ గ్రిల్స్‌ తొలగించి దుండగులు ఫైల్స్‌ ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. ఫైల్స్‌ మాయం అయినట్లు గుర్తించిన అధికారులు సెంట్రల్‌ జోన్‌ డీసీపీ శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ తెలిపారు. ఘటనాస్థలంలో ఆధారాలు సేకరించిన పోలీసులు.. ముఖ్యమైన ఫైల్స్‌ ఎత్తుకెళ్లినట్లు అనుమానిస్తున్నారు. ఫైల్స్ మిస్సింగ్ ఘటనపై పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌ను ప్రశ్నించగా.. ఫైల్స్‌ అదృశ్యంపై తమకు సమాచారం లేదని డైరెక్టర్‌ చెప్పినట్లు డీసీపీ తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement