Wednesday, February 21, 2024

IND vs SA | యువభారత్‌కు సఫారీల సవాల్‌.. రేపటినుంచే టీ20 సిరీస్.. !

పొట్టి క్రికెట్‌లో ఆస్ట్రేలియాను మట్టికరిపించిన యువ భారత్‌ మరో కఠిన సిరీస్‌కు సిద్ధమైంది. టీ20ల్లో బలమైన దక్షిఫ్రికాను వారి గడ్డపైనే ఢీకొనబోతున్నది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి పోరు డబ్లిన్‌ వేదికగా రేపు (ఆదివారం) జరగనుంది. అనుభవజ్ఞులైన సఫారీలను యువభారత్‌ ఏమేరకు నిలువరిస్తుందన్నది ఆసక్తిని రేకెతిస్తున్నది.


గాయపడిన హార్దిక్‌పాండ్యాతోపాటు టాప్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా విశ్రాంతిలో ఉండటం, టీ20 వరల్డ్‌ కప్‌కు ముందు సీనియర్‌ స్టార్లు కోహ్లి, రోహిత్‌శర్మ భవిష్యత్‌పై స్పష్టత లేనందున, యువ ఆటగాళ్లకు ఈ సిరీస్‌ గొప్ప అవకాశంగా నిలుస్తున్నది. తుది జట్టులోకి రోహిత్‌, విరాట్‌లను తీసుకుంటే, జట్టు కూర్పు కాస్త భిన్నంగా మారుతుంది. సూర్యకుమార్‌ నేతృత్వంలో స్వదేశంలో టీమిండియా ఆస్ట్రేలియాను 4-1తో ఓడించింది.

సఫారీ పేసర్లు కగిసో రబడ (విశ్రాంతి), ఎన్రిచ్‌ నార్జ్టే, లుంగి ఎన్‌గిడి గాయాలతో ఈ సిరీస్‌కు దూరమైనప్పటికీ, స్వదేశంలో ప్రొటీస్‌ బలమైనజట్టే. టీమిండియా బ్యాటింగ్‌ విషయానికొస్తే, ఓపెనర్‌ పాత్రలో జైస్వాల్‌ పరిణతి కనబరుస్తున్నాడు. శుభ్‌మన్‌గిల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ చెప్పుకోదగ్గ స్కోర్లు చేస్తున్నారు. నాలుగో స్థానంలో సూర్యకుమార్‌ లేదా కెఎల్‌ రాహుల్‌ మధ్య పోటీవుంది. అలాగే ఇషాన్‌ కిషన్‌ ఆరవ స్థానంలో మంచి ఫినిషర్‌గా ఎదుగుతున్నాడు. ఇతడికి జితేశ్‌ శర్మ నుంచి గట్టిపోటీ ఉంది. రుతురాజ్‌, జైస్వాల్‌, రింకు, జితేశ్‌ వంటి వారికి కింగ్స్‌మీడ్‌లో అదనపు బౌన్స్‌ సవాల్‌గా మారనుంది.

బౌలింగ్‌ ఎంపికలు

ఆస్ట్రేలియాతో సిరీస్‌లో భారత బౌలింగ్‌ దాడి పదునుగా కనిపించింది. అయితే దక్షిణాఫ్రికాలో, అదనపు బౌన్స్‌ పిచ్‌లపై ఏమేరకు ప్రభావం చూపుతారో చూడాలి. పైగా బౌన్సీ పిచ్‌ల మీద పొడగరి బౌలర్లు బాగా రాణిస్తారు. దీపక్‌ చా#హర్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, ముఖేష్‌ పేస్‌ దళానికి బాధ్యత వహించనున్నారు.స్పిన్‌ విభాగానికొస్తే రవీంద్ర జడేజా మేజిక్‌ చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. రెండవ స్పిన్నర్‌గా గూగ్లీ స్పెషలిస్టు రవి బిష్ణోయ్‌ అందుబాటులో ఉన్నాడు.

మనదే పైచేయి..

ఈ పర్యటనలో దక్షిణాఫ్రికా, భారత్‌ జట్లు మూడేసి టీ20లు, వన్డేలు రెండు టెస్టుల్లో తలపడతాయి. ఈనెల 10, 12, 14 తేదీల్లో టీ20లు, 17, 19, 21న వన్డేలు జరుగుతాయి. 26న తొలి టెస్టు, జనవరి 3న రెండో టెస్టు ప్రారంభమవుతాయి. టీ20 ప్రపంచకప్‌లతో కలిపి ఇరుజట్లు 26 మ్యాచ్‌లు ఆడాయి. ఇండియా 13, దక్షిణాఫ్రికా 8 గెలిచాయి. మూడు మ్యాచ్‌లు రద్దయ్యాయి.

నా స్టయిల్‌ నాదే: రింకు సింగ్‌

దక్షిణాఫ్రికాతో సిరీస్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. మా తొలి ప్రాక్టీస్‌ సెషన్‌ అద్భుతంగా జరిగింది. వాతావరణం కూడా చాలా బాగుంది. రాహుల్‌ ద్రవిడ్‌తో పని చేసే అవకాశం రావడం అదృష్టం. మా మధ్య జరిగిన సంభాషణ సమయంలో ఒకే మాట చెప్పాడు. ‘సహజంగా నువ్వు ఎలా ఆడతావో అలానే షాట్లు కొట్టేయ్‌’ ఇదీ నాకు ఇచ్చిన సందేశం. ఐదు లేదా ఆరో స్థానంలో బ్యాటింగ్‌ చేయాల్సి ఉంటుందని కూడా సూచించాడు. అలాంటి స్థానంలో ఆడాలంటే సవాల్‌తో కూడుకున్నదే. ఏమాత్రం కుదురుకోవడానికి సమయం ఉండదు. అయితే వ్యక్తిగతంగా ఆత్మవిశ్వాసంతో ఉండాలని ద్రవిడ్ హితబోధ చేశాడు. నేను యూపీ తరఫున ఇదే స్థానంలో చాన్నాళ్లు ఆడా. నాకెంతో కలిసొచ్చిన స్థానం. నాలుగైదు వికెట్లు పడిన తర్వాత ఆడటమంటే ఎలాంటి బ్యాటర్‌కైనా కష్టమే. కానీ, దూకుడుగా ఆడటం చాలా ఇష్టం. దక్షిణాఫ్రికా సిరీస్‌లోనూ ఇదే ఫాలో అవుతా” అని రింకుసింగ్‌ తెలిపాడు.

జట్లు:

భారత్‌: సూర్యకుమార్‌ యాదవ్‌ (సి), యశస్వి జైస్వాల్‌, శుభ్‌#మన్‌ గిల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, తిలక్‌ వర్మ, రింకు సింగ్‌, శ్రేయాస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌, జితేష్‌ శర్మ, రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌, రవి బిష్ణోయ్‌, కుల్దిdప్‌ యాదవ్‌, అర్ద్షీప్‌ సింగ్‌, సిరాజ్‌, ముఖేష్‌ కుమార్‌, దీపక్‌ చాహర్‌.

దక్షిణాఫ్రికా: ఐడెన్‌ మార్క్‌రామ్‌ (సి), ఒట్నీల్‌ బార్ట్‌మన్‌, మాథ్యూ బ్రీట్జ్కే, నాండ్రే బర్గర్‌, గెరాల్డ్‌ కోయెట్జీ (1వ,2వ టీ20లు), డోనోవన్‌ ఫెరీరా, రీజా హెండ్రిక్స్‌, మార్కో జాన్సెన్‌ (1వ, 2వ టీ20లు), హెన్రిచ్‌, కెస్హవ్‌, మహరాజ్‌, కెస్హవ్‌ క్లాస్‌ ఆండిలే ఫెహ్లూక్వాయో, తబ్రైజ్‌ షమ్సీ, ట్రిస్టన్‌ స్టబ్స్‌, లిజాద్‌ విలియమ్స్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement