Monday, May 27, 2024

IJR: న్యాయవ్యవస్థ సామర్థ్యంలో 10 ఉత్తమ రాష్ట్రాల్లో 3వ స్థానంలో తెలంగాణ

హైదరాబాద్ : దేశంలో న్యాయవ్యవస్థ సామర్థ్యంపై భారతదేశపు ఏకైక రాష్ట్రల ర్యాంకింగ్ అయిన 2022 ఇండియా జస్టిస్ రిపోర్ట్ (ఐజేఆర్), ఈ సంవత్సరం విడుదల చేయబడింది. ఈ నివేదిక ప్రకారం దేశంలో న్యాయవ్యవస్థ సామర్థ్యంలో ఉత్తమ 10 రాష్ట్రాల్లో తెలంగాణ 3వ స్థానంలో నిలిచింది. 2018, 2021 మధ్య గుర్తించదగిన పురోగతులు ఉన్నప్పటికీ, పోలీసు విభాగంలో కొనసాగుతున్న ఖాళీలు, తక్కువ లింగ వైవిధ్యాలు సమర్థవంతంగా న్యాయాన్ని అందించుటకు సమస్యలుగా ఆవిర్భవించాయి. తాజా సమాచారం ప్రకారం తెలంగాణాలోని పోలీసు, జైళ్ళు, న్యాయ వ్యవస్థల్లో మొత్తం ఖాళీలు 20,759 ఉన్నాయి.

ఈసందర్భంగా ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2022 చీఫ్ ఎడిటర్ ఎంఎస్.మాజా దారువాలా మాట్లాడుతూ… శక్తివంతమైన న్యాయ సంస్థలను, 2030 నాటికి అందరికి అందుబాటులో న్యాయాన్ని నిర్ధారించే తమ విశ్వవ్యాప్త నిబద్ధతను నెరవేర్చుకొనుటకు తాము ప్రయత్నాలు చేస్తుండగా, ఇండియా జస్టిస్ రిపోర్ట్స్ ప్రస్తుత న్యాయ వ్యవస్థలో, ముఖ్యంగా పోలీసు, న్యాయ వ్యవస్థల్లో లోపాలను పరిష్కరించుటకు అవసరమైన ప్రోత్సాహాన్ని ఇస్తుందన్నారు. కొనసాగుతున్న సవాళ్ళలో అంతర్దృష్టితో కూడిన డైలాగ్‌ని ప్రేరేపించడం ద్వారా, ఈ అంతర్దృష్టులు తక్షణ, పునాది సంస్కరణలు కోసం ఉన్న అవసరాన్ని పునరుద్ఘాటిస్తాయన్నారు. ఇవి చివరికి న్యాయమైన, సమానమైన సమాజానికి మార్గాన్ని సుగమం చేస్తాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement