Friday, May 17, 2024

హరీష్ పద్దు.. వ్యవ‘సాయం’కు పెద్దపీట

హైద‌రాబాద్ – ఈ ఆర్దిక సంవ‌త్సరానికి గాను రూ.2,30,825.96 కోట్లతో తెలంగాణ బడ్జెట్ ను ఆర్ధిక మంత్రి హ‌రీష్ రావు అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్టారు.. మొత్తం బ‌డ్జెట్ లో రెవెన్యూ వ్యయం రూ.1,69,383.44 కోట్లు కాగా,. క్యాపిటల్ వ్యయం రూ.29,046.77 కోట్లు, రెవెన్యూ మిగులు రూ.6,743.50 కోట్లుగా చూపారు. ఇక బ‌డ్జెట్ లో వ్య‌వ‌సాయ, సాగు నీటి రంగాల‌కు పెద్ద‌పీట వేశారు.. అలాగే పంచాయితీ, గ్రామీణ‌ అభివృద్ధికి ఏకంగా 29 వేల కోట్ల‌ను కేటాయించారు. ఇదే సమ‌యంలో సంక్షేమ ప‌థ‌కాల‌కు సైతం భారీగానే నిధులు కేటాయింపు జ‌రిగింది.. హైద‌రాబాద్ మెట్రోకు వెయ్యి కోట్లు, ఆర్టీసీకి రూ 1500 కోట్లు కేటాయించ‌డం విశేషం.. శాంతి భ‌ద్ర‌త‌ల‌ను ప‌రిర‌క్షించే హోం శాఖ‌కు ఈసారి బడ్జెట్ లోరూ.6465 కోట్లు, డ‌బుల్ రూం ఇళ్ల‌కు రూ.11 వేల కోట్లు, రైతుల రుణాలు మాఫీకిరూ. 5,225 కోట్లు కేటాయించారు…

ముఖ్య‌మైన కేటాయింపుల వివ‌రాలు..

పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు 29,271 కోట్లు.
రైతు బంధు కోసం 14,800 కోట్లు
రైతు రుణమాఫీ కోసం 5,225 కోట్లు
వ్యవసాయానికి 25 వేల కోట్లు
పశు సంవర్ధక శాఖకు 1730 కోట్లు
సాగునీటి రంగానికి 16,931 కోట్లు
సమగ్ర భూ సర్వే కోసం 400 కోట్లు
ఆసరా పింఛన్ల కోసం 11,728 కోట్లు
కల్యాణలక్ష్మీ/ షాదిముబారక్ 2750 కోట్లు
ఎస్సిల ప్రత్యేక ప్రగతి నిది కోసం 21,306.85 కోట్లు
ఎస్టీల ప్రత్యేక ప్రగతి కోసం 12,304.23 కోట్లు
నేతన్నల సంక్షేమం కోసం 338 కోట్లు.
బీసీ సంక్షేమ శాఖకు 5522 కోట్లు
పాఠశాల విద్యకి 11,735 కోట్లు
ఉన్నత విద్యా రంగానికి 1,873కోట్లు
విద్యుత్ శాఖకు 11,046 కోట్లు
పరిశ్రమల శాఖకు 3, 077 కోట్లు
అటవీ శాఖకు 1,276 కోట్లు
రోడ్లు భవనాల శాఖకు 8,788 కోట్లు.
పౌరసరఫరాల శాఖకు 2, 363 కోట్లు.
పర్యాటక రంగానికి 726 కోట్లు.
వ్యవసాయ యాంత్రీకరణకు 1500 కోట్లు.
నూతన సచివాలయ నిర్మాణం కు 610 కోట్లు.
రీజినల్ రింగ్ రొడ్డు భూ సేకరణ కు 750 కోట్లు.
దేవాదాయ శాఖకు 720 కోట్లు.
ఆర్టీసీ కి 1500 కోట్లు.
ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసం 800 కోట్లు…త్వరలో మార్గదర్శకాలు
పోలీసు స్టేషన్ లలో షి టాయిలెట్ ల నిర్మాణం కోసం 20 కోట్ల రూపాయలు,
యూనివర్సిటీలలో షి టాయిలెట్స్ నిర్మాణం కోసం 10 కోట్ల రూపాయలు
మహిళ,శిశు సంక్షేమం కోసం 1702 కోట్లు
డబులబెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం కోసం 11వేల కోట్లు
పట్టణాల్లో వైకుంఠదామల నిర్మాణం కోసం 200 కోట్లు
హైదరాబాద్ లో ఉచిత మంచి నీటి సరఫరాకు 250 కోట్ల రూపాయలు
హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం సుంకిషాల వద్ద నిర్మించే తాగునీటి ప్రాజెక్టుకు 725 కోట్లు
మూసీ సుందరికరణకు 200 కోట్లు
మెట్రోరైలు ప్రాజెక్టు కోసం వెయ్యి కోట్లు
వైద్య ఆరోగ్య శాఖకు 6295 కోట్లు
4 వేల కోట్లతో సరికొత్త విద్యా పథకం
రాబోయే రెండేళ్లలో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల నిర్మాణం.
ఐటి రంగం 360 కోట్లు.
కలెక్టరేట్లు,జిల్లా పోలీసు కార్యాలయలు,పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ కోసం 725 కోట్లు
హోమ్ శాఖకు 6465 కోట్లు.
పౌర సరఫరాల శాఖకు 2363 కోట్లు.

Advertisement

తాజా వార్తలు

Advertisement