Monday, April 29, 2024

హైదరాబాద్‌ కేంద్రంగా కోర్‌.ఎఐ విస్తరణ

సాఫ్ట్‌వేర్‌ ప్లాట్‌ఫామ్‌ సొల్యూషన్స్‌ కంపెనీ కోర్‌ ఎఐ తమ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్సీ సాఫ్ట్‌వేర్‌ వేదిక, సొల్యూషన్స్‌ కంపెనీ కోర్‌ఎఐ హైదరాబాద్‌ కేంద్రంగా విస్తరణ చేపట్టింది. అరబిందో గెలాక్సీ టవర్స్‌ వద్ద 500 మంది సిబ్బంది సామర్థ్యం ఉన్న ఆఫీస్‌ స్పేస్‌ను ప్రారంభించామని తెలిపింది. ఈ సందర్భంగా సీఈవో రాజ్‌ కోనేరు మాట్లాడుతూ కొత్త కార్యాలయం సంస్థ కేంద్రంగా పనిచేస్తోందన్నారు. రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌తో కార్యక్రమాలతోపాటు కంపెనీ నిర్మిస్తున్న ఎఐ ఫస్ట్‌ సొల్యూషన్స్‌ కస్టమర్‌ సపోర్ట్‌, కన్సల్టింగ్‌, ఇంజినీరీంగ్‌ ఇతర అనుబంధ సేవలుతోపాటు తమ కార్యకలాపాలకు హైదరాబాద్‌ కేంద్రంగా వ్యవహరిస్తోందన్నారు. సంస్థ గ్లోబల్‌ రిసెర్చ్‌ హబ్‌గా ఈ కార్యాలయం ఉంటుందని రాజ్‌ కోనేరు తెలిపారు.

కన్వర్జేషనల్‌ ఎఐ టెక్నాలజీ పురోగతికి కృషి చేస్తామన్నారు. రాబోయే ఆర్థిక సంవత్సరంలో తమ సంస్థ అభివృద్ధికి రూ.185కోట్ల పెట్టుబడులు పెట్టనున్నామని, ఉద్యోగులసంఖ్యను 1100మందికి పెంచనున్నామని వివరించారు. ప్రస్తుతం తమ సంస్థలో 450మంది ఉద్యోగులు ఉన్నారని వీరిలో ఎక్కువభాగం హైదరాబాద్‌లో పనిచేస్త్తుండగా జపాన్‌, దక్షిణ కొరియా, ఉత్తర, దక్షిణ అమెరికాలో మరో 100మంది ఉన్నారన్నారు. కరోనా ప్రభావం నేపథ్యంలో పలు సంస్థలు కన్వర్జేషనల్‌ ఎఐకి పెద్దపీట వేస్తున్నాయన్నారు. స్టార్ట్‌ అసిస్ట్‌, బ్యాంక్‌ అసిస్ట్‌, సెర్చ్‌, వర్క్‌ అసిస్ట్‌, హెచ్‌ఆర్‌, ఐటీ అసిస్ట్‌ వంటి సేవలను ఆయా కంపెనీల అవసరాలకు అనుగుణంగా అందిస్తామని కొత్త కార్యాలయ ప్రారంభం అనంతరం రాజ్‌ తెలిపారు.

.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement