Thursday, May 2, 2024

Hyd | కాలేజీ విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి.. ప్రభుత్వంతో హెచ్‌సీసీబీ ఒప్పందం

హైదరాబాద్ (ప్ర‌భ‌న్యూస్‌): దేశంలోని ప్రముఖ ఎఫ్‌ఎంసిజి కంపెనీలలో ఒకటైన హిందుస్తాన్ కోకా-కోలా బెవరేజెస్ (హెచ్‌సిసిబి) 2023 -24 నాటికి అదనంగా మరో 10వేల మంది కళాశాల విద్యార్థుల నైపుణ్యాన్ని మెరుగుపరిచేందుకు తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. హెచ్‌సిసిబి, తెలంగాణ ప్రభుత్వం కలిసి 2022లో తమ భాగస్వామ్య మొదటి సంవత్సరంలో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 10,196 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చాయి.

తెలంగాణ ప్రభుత్వ కార్మిక, ఉపాధి, కర్మాగారాలు, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి సి హెచ్ మల్లారెడ్డి సమక్షంలో హెచ్‌సిసిబి , తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్నివిస్తరిస్తున్నట్లు ప్రకటించింది. ప్రిన్సిపల్ సెక్రటరీ, జయేష్ రంజన్, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (TASK) సీఈఓ శ్రీకాంత్ సిన్హా, హిందూస్థాన్‌ కోకా-కోలా బెవరేజెస్ చీఫ్ పబ్లిక్ అఫైర్స్, కమ్యూనికేషన్స్ & సస్టైనబిలిటీ ఆఫీసర్ హిమాన్షు ప్రియదర్శి , కంపెనీ హెడ్, హెచ్ ఆర్ చిత్ర గుప్తా, ఇతర ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement