Sunday, October 6, 2024

HYD: అభివృద్ధిని చూసి.. మరోసారి అవకాశమివ్వండి.. సుధీర్ రెడ్డి

కర్మన్ ఘాట్, నవంబర్ 24 (ప్రభ న్యూస్) : ఎల్బీనగర్ నియోజకవర్గం ప్రజలు అభివృద్ధిని ప్రోత్సహించి తనను మరొకసారి గెలిపించాలని ఎల్బీనగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. లింగోజిగూడా డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావు ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని ఎల్.బి.నగర్ ఓల్డ్ విలేజ్ మసీదు గల్లీలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పాదయాత్రలో ఎల్.బి.నగర్ భారాస పార్టీ అభ్యర్థి, శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొని ఓటర్లను ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా ముద్రబోయిన శ్రీనివాసరావు మాట్లాడుతూ… శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సహకారం డివిజన్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు. నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే కారు గుర్తుకు ఓటు వేసి సుధీర్ రెడ్డిని గెలిపించాలని కోరారు.

అనంతరం సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. గత నాలుగున్నర సంవత్సరాలుగా నియోజకవర్గం మొత్తం కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నానని తెలిపారు. తాను చేసిన అభివృద్ధిని చూసి మరలా గెలిపిస్తే చేయబోయే కార్యక్రమాలు గురించి వివరాలతో సహా తెలియచేశారు. ఎప్పుడూ నియోజవర్గం చూడని ఎటువంటి ప్రజాహిత పనులు చేయని వారిని ప్రజలు తిరస్కరిస్తారన్నారు. రాష్ట్రంలో ఎల్.బి.నగర్ అతి పెద్ద నియోజకవర్గం కావడంతో ముఖ్యమంత్రితో మాట్లాడి తానిచ్చిన గ్యారంటీలన్నింటిని పూర్తి చేశానని చెప్పారు. అభ్యర్థుల గుణ గణాలను గుర్తించి ఓటేయాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement