Thursday, October 3, 2024

SAMSUNG: మార్కెట్లోకి శాంసంగ్.. ఎంటర్‌ప్రైజ్ ఫోకస్డ్ స్మార్ట్‌ ఫోన్ – గెలాక్సీ ఎక్స్ కవర్ 7

హైదరాబాద్ : భారతదేశపు అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన శాంసంగ్ తన మొట్టమొదటి ఎంటర్‌ప్రైజ్ ఫోకస్డ్ స్మార్ట్‌ ఫోన్ – గెలాక్సీ ఎక్స్ కవర్ 7ని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈసంద‌ర్భంగా శాంసంగ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ ఆకాష్ స‌క్సేనా మాట్లాడుతూ.. ఈ ఉత్పత్తుల ద్వారా త‌మ వినియోగదారులకు సౌలభ్యం, మన్నికను అందించడమే శాంసంగ్ లో త‌మ లక్ష్యమ‌న్నారు. తాము గెలాక్సీ ఎక్స్ కవర్ 7 సిరీస్‌ని గెలాక్సీ ఎక్స్ కవర్ 7 ఎంటర్‌ప్రైజ్ ఎడిషన్, స్టాండర్డ్ ఎడిషన్ అనే రెండు వేరియంట్ల‌లో పరిచయం చేశామ‌న్నారు.

ఈ రెండు పరికరాలు కూడా అత్యాధునిక సాంకేతికతలతో రూపొందించబడ్డాయి, అవి అత్యంత శక్తివంతంగా ఉంటాయన్నారు. కఠినమైన వాతావరణ పరిస్థితులకు తట్టుకోగలవన్నారు. నాక్స్ ఆధారితం తాము త‌మ‌ కార్పొరేట్ కస్టమర్‌లకు ఈ విప్లవాత్మక ఉత్పత్తులను అందించడానికి సంతోషిస్తున్నామ‌న్నారు. ఇది ఉద్యోగుల ఉత్పాదకతను పెంచుతుందని, డేటా భద్రతను నిర్ధారిస్తుందని ఆశాజనకంగా ఉన్నామ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement