Monday, May 6, 2024

కొత్త స్టేషన్ సౌండ్స్ ఆవిష్కర‌ణ‌తో వైబ్ ఆఫ్ ది సిటీ ని మార్చిన రేడియో సిటీ

హైద‌రాబాద్ : భారతదేశపు ప్రముఖ రేడియో నెట్‌వర్క్ అయిన రేడియో సిటీ అధికారికంగా రాగ్ రాగ్ మే దౌడ్ సిటీ, సిటీలో కొత వైబ్ ఆధునిక వెర్షన్‌ను విడుదల చేసింది. అత్యంత ఉత్సాహపూరితమైన కొత్త ట్రాక్ ప్రేక్షకులను, ముఖ్యంగా జెన్ జెడ్ తరాన్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దబడింది. ఈసంద‌ర్భంగా రేడియో సిటీ సీఈఓ అషిత్ కుకియాన్ మాట్లాడుతూ… రేడియో సిటీలో తాము ఎల్లప్పుడూ అర్థవంతమైన మార్గాల్లో అందరి కంటే ముందు ఉండేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఈ వినూత్నమైన జింగిల్ త‌మ ప్రేక్షకుల, ప్రత్యేకించి జెన్ జెడ్ విభాగపు మారుతున్న ప్రాధాన్యతలతో నిమగ్నమవ్వడానికి త‌మ నిబద్ధతను సూచిస్తుందన్నారు.

రాగ్ రాగ్ మే దౌడ్ సిటీ, సిటీలో కొత వైబ్ కొత్త వెర్షన్ రేడియో సిటీ కొత్త స్ఫూర్తిని, త‌మ అంకితభావాన్ని ప్రతిబింబిస్తుందని తాము విశ్వసిస్తున్నామన్నారు. గాయకుడు ఎల్‌వి రేవంత్ మాట్లాడుతూ… రేడియో సిటీ కొత్త స్టేషన్ సౌండ్ మార్పులో భాగం కావడం ఆనందంగా వుందన్నారు. ఈ జింగిల్ శ్రోతలను ఉత్తేజపరుస్తుందన్నారు. వారికి చిరస్మరణీయమైన సంగీత అనుభవాన్ని అందిస్తుందని తాను నమ్ముతున్నానని అన్నారు. ప్రముఖ గాయని లాలస రాచపూడి మాట్లాడుతూ.. రేడియో సిటీ సూపర్ సింగర్ సీజన్ 13 విజేతగా, వారి విప్లవాత్మక మార్పులో భాగం కావడం ప్రత్యేకమైనదన్నారు. ఈ జింగిల్ జెన్ జెడ్ లో అభిమానుల అభిమానాన్ని పొందుతుందని తాను విశ్వసిస్తున్నానన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement