Thursday, May 2, 2024

కొత్తగా ఎక్స్ ట్రీమ్ 200ఎస్ 4 వాల్వ్‌ ను ప్రవేశపెట్టిన హీరో మోటో కార్ప్

హైదరాబాద్ : ప్రపంచంలోనే మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల అతిపెద్ద తయారీసంస్థ అయిన హీరో మోటోకార్ప్ ప్రీమియం విభాగంపై దృష్టి సారించి తన ప్రీమియం పోర్ట్‌ ఫోలియోను మరో శక్తివంతమైన జోడింపుతో పెంచుకుంది. హీరో ఎక్స్ ట్రీమ్ 160ఆర్ 4వీ ఆవిష్కరణ తరువాత కంపెనీ కొత్తగా ఎక్స్ ట్రీమ్ 200ఎస్ 4 వాల్వ్‌ ను ప్రవేశపెట్టింది. ఈసంద‌ర్భంగా హీరో మోటార్ కార్ప్, ఇండియా బీయూ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రంజీవ్‌జిత్ సింగ్ మాట్లాడుతూ… హీరో ఎక్స్‌ ట్రీమ్ 200ఎస్ త‌మ ప్రీమియం స్పోర్ట్స్ సెగ్మెంట్ కోసం త‌మ ఫోకస్డ్ విధానాన్ని ప్రదర్శిస్తుందన్నారు.

రైడింగ్ ఔత్సాహికులకు నిజమైన మాస్టర్ పీస్ ఇదన్నారు. హీరో ఎక్స్‌ ట్రీమ్ 200ఎస్ 4వీ అనేది ఆల్ డే స్పోర్ట్స్ మోటార్‌సైకిల్ అన్నారు. అర్బన్, స్పోర్టీ పనితీరును చక్కగా మిళితం చేస్తుందన్నారు. తాము త‌మ‌ ప్రీమియం ఉత్పత్తుల కోసం అడ్వెంచర్, టూ రింగ్, స్ట్రీట్‌ఫైటర్ విభాగాల్లో సమాంతర వ్యూహాన్ని విజయవంతంగా రూపొందించాం, అభివృద్ధి చేశామ‌న్నారు. అధిక కస్టమర్ స్పందనను పొందామ‌న్నారు. త‌మ తాజా ఉత్పాదన- ఎక్స్ ట్రీమ్ 200ఎస్ 4వీ, ఈ విభాగం విజయాన్ని మరింత పెంపొందిస్తుందని, త‌మ కస్టమర్‌లతో బలమైన సంబంధాన్ని ఏర్పరుస్తుందని తాము నమ్ముతున్నామ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement