Thursday, February 22, 2024

muthoot: రాజమండ్రిలో గోల్డ్ పాయింట్ సెంటర్‌ను ప్రారంభించిన ముత్తూట్ ఎగ్జిమ్

హైదరాబాద్, అక్టోబర్ 28: భారీ వ్యాపార సమ్మేళనం ముత్తూట్ పప్పచన్ గ్రూప్ (దీనిని ముత్తూట్ బ్లూ అని కూడా పిలుస్తారు) విలువైన లోహపు విభాగం, ముత్తూట్ ఎగ్జిమ్ (P) లిమిటెడ్, తమ నూతన కేంద్రం ను G.S. రావు కాంప్లెక్స్, డోర్ నెంబర్ 6-6-10, గ్రౌండ్ ఫ్లోర్, టి.నగర్, కోటిపల్లి బస్టాండ్ దగ్గర, రాజమండ్రి వద్ద కొత్త ముత్తూట్ గోల్డ్ పాయింట్ సెంటర్‌ను ప్రారంభించింది. ఈ గోల్డ్ పాయింట్ సెంటర్ రాష్ట్రంలో ముత్తూట్ ఎగ్జిమ్ ప్రారంభించిన మూడవ సెంటర్ అవుతుంది. వినియోగదారులకు తమ బంగారాన్ని విక్రయించడానికి విశ్వసనీయమైన, నమ్మకమైన కేంద్రాన్ని అందించాలనే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేసింది.

ఈ కేంద్ర ప్రారంభోత్సవం గురించి ముత్తూట్ ఎగ్జిమ్ సీఈఓ కేయూర్ షా మాట్లాడుతూ…. విలువైన లోహాల వ్యాపారంలో రాజమండ్రి కీలకమైన మార్కెట్లలో ఒకటిగా వెలుగొందుతుందన్నారు. ఈ ఆశాజనక నగరంలో త‌మ సేవలను అందించడానికి తాము సంతోషిస్తున్నామన్నారు. త‌మ సేవలు అవసరమయ్యే మరింత మంది కస్టమర్‌లను చేరుకోవడానికి ఈ నూతన బ్రాంచ్ త‌మకు సహాయం చేస్తుందన్నారు. బంగారం రీసైక్లింగ్‌ను ప్రోత్సహిస్తూ, సామాన్యులు తమ ఆస్తిని ఉత్పాదక వినియోగంలో ఉంచడంలో సహాయపడాలనేది త‌మ లక్ష్యమ‌న్నారు. ముత్తూట్ పప్పచన్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ముత్తూట్ ఎగ్జిమ్ మేనేజింగ్ డైరెక్టర్ థామస్ ముత్తూట్ మాట్లాడుతూ… త‌మ పరివర్తన వ్యూహంలో భాగంగా తాము త‌మ అన్ని వ్యాపారాల్లో అనేక వ్యూహాత్మక చర్యలు తీసుకున్నామన్నారు. తాము దేశవ్యాప్తంగా త‌మ కార్యకలాపాలను విస్తరిస్తున్న వేళ, ముత్తూట్ పప్పాచన్ గ్రూప్ బలం అండ్ భేదం ప్రతి ఒక్క కస్టమర్ అవసరాలు & కోరికల గురించి సన్నిహితంగా అర్థం చేసుకోవడం, అతను లేదా ఆమె జీవితాన్ని ఉన్నతంగా మార్చడంలో సహాయపడటానికి తగిన పరిష్కారాలను రూపొందించడం అనే దాని ప్రధాన తత్వశాస్త్రం నుండి ఉద్భవించిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement