Friday, October 11, 2024

HYD: రేపు గడ్డి అన్నారం డివిజన్ కాలనీవాసులతో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆత్మీయ భేటీ

హైదరాబాద్ తూర్పు, ఆగస్టు 25: గడ్డి అన్నారం డివిజన్ పరిధిలోని వివిధ కాలనీ సంక్షేమ సంఘ సభ్యులు, కాలనీ వాసులతో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి రేపు సమావేశం కానున్నారు. శనివారం సాయంత్రం ఐదు గంటలకు డివిజన్ పరిధిలోని నేతాజీ నగర్ సాయి గార్డెన్ లో కాలనీవాసులందరితో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయనున్నారని మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్, డివిజన్ అధ్యక్షుడు జక్కుల శ్రీశైలం యాదవ్, కార్యనిర్వాక అధ్యక్షుడు పటేల్ రమణారెడ్డి వెల్లడించారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్యేతో ముఖాముఖి కార్యక్రమం ఉంటుందని, తమ తమ కాలనీ అభివృద్ధి పనులతో పాటు, సమస్యలను సమావేశం దృష్టికి తీసుకురావచ్చని వారు వివరించారు. ఈ సమావేశానికి ప్రతి కాలనీవాసులు విధిగా హాజరై ఆత్మీయ సమావేశాన్ని జయప్రదం చేయాలని వారు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement