Tuesday, May 21, 2024

TS : మల్కాజ్‌గిరి గెలుపు బీఆర్ఎస్ దే… ఎమ్మెల్యే కేపీ.వివేకానంద గౌడ్

కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 23( ప్రభ న్యూస్): మల్కాజ్‌గిరి పార్లమెంట్ కు జరిగే ఎన్నికల్లో బీఆర్ ఎస్ గెలుపు ఖాయమని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద గౌడ్ అన్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం 132- జీడిమెట్ల డివిజన్ ఎం.ఎన్.రెడ్డి నగర్ ఫేజ్ – 1,2,3,4, వెంకటేశ్వర కాలనీ ఈస్ట్ అండ్‌ వెస్ట్ కాలనీలలో ఎమ్మెల్యే కేపీ. వివేకానంద ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద గౌడ్ మాట్లాడుతూ గత పదేళ్ల కాలంలో బిఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ మహానగరంలోని అన్ని నియోజకవర్గాలను ఎంతో అభివృద్ధి చేసిందన్నారు. కానీ మల్కాజ్‌గిరి ఎంపీగా గెలిచిన రేవంత్ రెడ్డి మాత్రం ఒక్క రూపాయి కూడా ఎక్కడ ఖర్చుపెట్టిన దాఖలాలు లేవన్నారు. ఇలాంటి వారికి పదవులు, రాజకీయాలు మాత్రమే అవసరమని ప్రజా సంక్షేమం కాదన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో పదవుల కోసం పాకులాడే బిజెపి, కాంగ్రెస్ పార్టీలను పక్కకు పెట్టి ప్రజా సంక్షేమం కోసం పనిచేసిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రావిడి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కిషన్ రావు, సీనియర్ నాయకులు సంపత్ మాధవరెడ్డి, కుంట సిద్ధిరాములు, సుధాకర్ గౌడ్, సమ్మయ నేత, గుమ్మడి మధుసూదన్ రాజు, జ్ఞానేశ్వర్, ఎల్లా గౌడ్, తోకల నాగేష్, ఇందిరా రెడ్డి, వెంకటేశ్వర నగర్ నుండి వేణుగోపాల్, మహేశ్వర్, సంజీవరెడ్డి, లక్ష్మణ్, రామ్మోహన్, మురళి, మూర్తి, ఎమ్.ఎన్.రెడ్డి నగర్ ఫేస్ -1 మరియు ఫేస్ – 2 నుండి సంపత్ గౌడ్, రవీందర్ గౌడ్, పరమేశ్వర్ గౌడ్, బాపిరెడ్డి, శ్రీనివాస్, బిక్షపతి, విజయ్, రామాంజనేయులు, రఘుపతి, స్వామి, వెంకటేష్, జనార్ధన్, రమేష్, బాల్ రెడ్డి, చంద్రశేఖర్, కుమార్, శ్రీకాంత్ రెడ్డి లు, ఎమ్.ఎన్.రెడ్డి నగర్ ఫేస్-3 నుండి రాముడు యాదవ్, సుధా శంకర్,ఎం.ఎన్.రెడ్డి నగర్ -4 : గోవర్ధన్ రెడ్డి, నాగేశ్వరరావు, మోహన్ రావు, శంకర్, మోహన్, చంద్రారెడ్డి, సంజీవరావు, మధన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement