Saturday, May 18, 2024

ఉస్మానియా ఆసుపత్రికి అత్యాధునిక లాపరోస్కోపిక్‌ యంత్రం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఉస్మానియా ఆసుపత్రి జనరల్‌ సర్జరీ విభాగానికి కొత్తగా లాపరోస్కోపిక్‌ సెట్‌ను ప్రభుత్వం సమకూర్చింది. మంగళవారం నూతన ఆపరేషన్‌ థియేటర్‌ కాంప్లెక్స్‌ లో కొత్త పరికరాన్ని ఆసుపత్రి సూపరిండెంట్‌ డా. నాగేందర్‌ ప్రారంభించారు. ఇప్పటికే ఆసుపత్రిలో లాపరోస్కోపిక్‌ పరకరాలు ఉన్నాయని,వాటికన్నా ఇప్పుడు సమకూర్చుకున్న పరికరం అత్యాధునికమైందన్నారు.

దీని విలువ దాదాపు రూ.55లక్షలుగా ఉంటుందన్నారు. తాజా పరికరంతో త్వరితగతిన మరిన్ని సర్జరీలు చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. రోగి ఆసుపత్రిలో ఎక్కువ రోజులుగడపకుండా త్వరగా కోలుకుని డిశ్చార్జి అవుతారని పేర్కొన్నారు. ఆసుపత్రికి అండగా ఉంటున్న ప్రభుత్వం, వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి హరీష్‌రావుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement