Saturday, May 11, 2024

ఘ‌నంగా కాసాని సాయి ముదిరాజ్ జ‌న్మ‌దిన వేడుక‌లు

మాజీ ఎమ్మెల్సీ, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు సీనియర్ నాయకులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తనయుడు కాసాని సాయి ముదిరాజ్ జన్మదినోత్సవం సందర్భంగా బాచుపల్లి రేణుక ఎల్లమ్మ ఆలయంలో ఎమ్మెల్సీ జిల్లా తెరాస అధ్యక్షుడు శంభిపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద, సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంత‌రం సాయి ముదిరాజ్ ను శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో తెరాస ఫ్లోర్ లీడర్ ఆగం పాండు ముదిరాజ్, NMC తెరాస అధ్యక్షుడు రంగారయ ప్రసాద్, కార్పొరేటర్లు కోలన్ వీరంద్రర్ రెడ్డి, ఆగం రాజు ముదిరాజ్, ఏనుగుల శ్రీనివాస్ రెడ్డి, బాలాజీ నాయక్, సురేష్ రెడ్డి, విజయలక్ష్మి సుబ్బారావు, కాసాని సుధాకర్‌, కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ సలీం, తెరాస నాయకులు కోలన్ శ్రీనివాస్ రెడ్డి, చంద్రగిరి సతీష్, రవికాంత్, తెరాస అనుబంధ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement