Saturday, May 4, 2024

TS: బరువు తగ్గాలనుకుంటే… అల్పాహారంగా బాదంపప్పు తీసుకోండి…

హైద‌రాబాద్ : బాదం, ఆహారం నాణ్యతను మెరుగు పరుస్తుందని, బరువు నిర్వహణలో బాదములు సహాయ పడతాయని రెండు కొత్త అధ్యయనాలు వెల్లడించాయి. అధిక బరువు లేదా ఊబకాయం ఉన్న వ్యక్తులు తీసుకునే తక్కువ కేలరీల ఆహారంలో బాదం జోడించడం వల్ల బరువు తగ్గేందుకు కూడా అవకాశం వుంది. ఈసంద‌ర్భంగా హ్యూమన్ న్యూట్రిషన్ ప్రొఫెసర్ అండ్ సౌత్ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయంలో వ్యాయామం, పోషకాహారం, కార్యాచరణలో అలయన్స్ ఫర్ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ అలిసన్ కోట్స్ మాట్లాడుతూ…. వెయిట్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ తర్వాత బరువు తగ్గడం సవాలుగా ఉంటుందన్నారు. చాలా మంది వ్యక్తులు వారి ప్రోగ్రామ్ క్యాలరీ పరిమితి దశ ముగింపులో బరువును తిరిగి పొందడం జరుగుతుందన్నారు. వెయిట్ మేనేజ్ మెంట్ ఈటింగ్ ప్లాన్ కు బాదంపప్పును జోడించడం వల్ల అర్ధవంతమైన రీతిలో బరువు తగ్గడాన్ని ప్రోత్సహించడమే కాకుండా ఆరోగ్యకరమైన, స్థిరమైన ఆహారాన్ని కూడా అందించవచ్చని ఈ అధ్యయనం చూపించిందన్నారు.

ఢిల్లీ డైటీటిక్స్ రీజిన‌ల్ హెడ్ మాక్స్ హెల్త్ కేర్ రితికా సమద్దర్ మాట్లాడుతూ… బ్రౌన్ అధ్యయనం ప్రకారం, బిస్కెట్ల కంటే ఒక సంవత్సరం పాటు బాదంపప్పును ఎంచుకోవడం వల్ల ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖ‌నిజాలు వంటి అవసరమైన పోషకాలు గణనీయంగా ఎక్కువగా తీసుకోవడమే కాకుండా ఆరోగ్యకరమైనవి గా కూడా ఉంటాయన్నారు. బాదంపప్పులు సంపూర్ణత్వం, మెరుగైన ఆహార నాణ్యత, మొత్తం ఆరోగ్యానికి దోహదపడతాయన్నారు. పోషకాహార నిపుణులు, ఎంబీబీఎస్ డాక్టర్ రోహిణి పాటిల్ మాట్లాడుతూ… ఈ అధ్యయనాలు సమతుల్య, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రోత్సహించడంలో బాదం పాత్రను సమిష్టిగా నొక్కి చెబుతున్నాయన్నారు. అలవాటైన స్నాకర్లకు బాదం ఒక పోషకమైన, సంతృప్తికరమైన చిరుతిండి ఎంపికగా ఉంటుందని వారు సూచిస్తున్నారన్నారు. పరిశోధనలు బాదంపప్పును సమతుల్య ఆహారంలో విలువైన భాగంగా హైలైట్ చేస్తాయన్నారు.

న్యూట్రిషన్ అండ్ వెల్‌నెస్ కన్సల్టెంట్ షీలా కృష్ణస్వామి మాట్లాడుతూ…. బాదం క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఊబకాయం వస్తుందని చాలా మంది తప్పుగా నమ్ముతారన్నారు. బాదంపప్పులను క్రమం తప్పకుండా తినడం వల్ల స్థూలకాయం రాదని 2 అధ్యయనాలు పునరుద్ఘాటించడాన్ని గమనించడం హర్షణీయమ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement