Monday, May 6, 2024

పదిలో చతికిలబడ్డ హైదరాబాద్‌..

ప్రభ న్యూస్‌, హైదరాబాద్‌ ప్రతినిధి : పదవతరగతి ఫలితాల్లో 79.63 శాతం ఉత్తీర్ణత సాధించి హైదరాబాద్‌ జిల్లా రాష్ట్ర స్థాయిలో చిట్ట చివరి స్థానంలో నిలిచింది. గురువారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పది ఫలితాలను ప్రకటించారు. మే 23 నుంచి జూన్‌ 1 వరకు జరిగిన పరీక్షల్లో 90 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా అందులో 87.61 శాతం బాలురు, 92.85 శాతం బాలికలు ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా 97.85 శాతం ఉత్తీర్ణత సాధించి మొదటి స్థానంలో నిలవగా, 79.63 శాతం ఉత్తీర్ణత సాధించి హైదరాబాద్‌ చివరి స్థానంలో నిలిచింది.

హైదారబాద్‌ జిల్లాలో 36633 బాలురు, 37324 బాలికలు కలిపి మొత్తం 73957 విద్యార్థులు పరీక్షకకు హాజరు కాగా 58889 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అందులో 27400 బాలురు కాగా 31489 బాలికలు ఉన్నారు. సగటున 74.8 శాతం బాలురు, 84.37 శాతం బాలికలు ఉన్నారు. హైదరాబాద్‌ జిల్లా పదవతరగతి ఫలితాల్లో రాష్ట్రంలోనే చివరి స్థానంలో నిలవడానికి జిల్లా విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఆగస్టు 1నుంచి అడ్వాస్డ్‌ సప్లమెంంటరీ పరీక్షలు ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement